- స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో పెద్దపీట
- రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా వ్యవసాయం
- అమరావతిలో నాబార్డ్‌కు ఐకానిక్ భవనం
- కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ(చైతన్యరథం): గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి, వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డ్ తనవంతు కృషిచేస్తుందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నా రు. బుధవారం స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్‌లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఏపీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆర్థిక మంత్రి పయ్యావు ల కేశవ్, నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చె న్నాయుడు మాట్లాడుతూ నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డు విశేష కృషి చేస్తుందన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయరంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకెళుతున్నారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.45 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవసా యం, అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 64 శాతం, జీడీపీలో నాబార్డ్ 34 శాతంగా ఉన్నాయన్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో నిర్మించే నాబార్డ్ శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్నిరకాల సదుపాయాలతో ఒక ఐకానిక్‌లా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొస్తామని, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం అమలు చేస్తామన్నారు. ఫిషరీస్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎగుమతులను మరింత ప్రోత్సహిస్తామన్నారు. డ్రోన్లతో వ్యవసాయం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే 40 వేల డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నాబార్డ్, బ్యాంకింగ్ సెక్టార్ ప్రభుత్వానికి సహకరించి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
రుణాలను సద్వినియోగం చేసుకునేలా కృషిచేయాలి
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నాబార్డు సహాయంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభించి మంజూరైన రుణాలను సద్వినియోగం చేసుకునేం దుకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని సూచించారు. నాబార్డ్ సహకా రంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. బ్యాంకింగ్ నెట్వర్క్ బలోపేతరి, సమ్మిళిత బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి నాబార్డ్ విశేష కృషి చేస్తుందని, స్వయం ఉపాధిని పెంపొందించ డం, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటులో నాబార్డ్ ముఖ్యపాత్ర పోషిస్తోందని తెలిపారు. నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ మాట్లాడుతూ నాబార్డు ద్వారా సహాయం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. నాబార్డు సంబంధిత శాఖలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, ఆర్థిక సమ్మిళితం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముం దంజలో ఉంటారన్నారు. నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ భారతానికి సేవ చేయడంతో పాటు వ్యవసా యం, గ్రామీణ శ్రేయస్సుకు నాబార్డ్ తన నిబద్ధతను నెరవేరుస్తోందని తెలిపారు. అనం తరం మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సహకార శాఖ సెక్రటరీ ఎ.బాబు, ప్రభుత్వ కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్‌లను నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ పొందూరు ఖాదీ కండువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.