చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కీలక పాలసీలకు క్లియరెన్స్‌

శరవేగంగా అమరావతి పనులు: మున్సిపల్‌ మంత్రి నారాయణ

by చైతన్యరధం
Dec 4, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కీలక పాలసీలకు క్లియరెన్స్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐటీ, టెక్స్‌టైల్‌, మారిటైంకు కేబినెట్‌ ఆమోదం
  • సమీకృత పర్యాటక పాలసీకీ ఓకే
  • ‘ఆయుర్వేద’ రిజిస్ట్రేషన్‌ చట్టసవరణకు ఆమోదం
  • ఉద్దానం, పులివెందుల, డోన్‌కు తాగునీటి ప్రాజెక్టులు
  • ఆత్మార్పణ సంస్మరణ దినంగా డిసెంబర్‌ 15
  • కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిరచిన సమాచార మంత్రి కొలుసు

అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్‌ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29 స్పోర్ట్స్‌ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ సమావేశం వివరాలను రాష్ట్ర సమాచార మంత్రి కొలుసు పార్థసారథి, మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ మీడియాకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి కొన్ని ముఖ్యమైన పాలసీలను కేబినెట్‌ ఆమోదించిందని మంత్రి కొలుసు వివరించారు. వాటిలో ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ పాలసీ 4.0, ఏపీ టెక్స్టైల్స్‌ గార్మెంట్‌ పాలసీ, ఏపీ మారిటైమ్‌ పాలసీ ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ ఎకానమీకి గ్లోబల్‌ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ అండ్‌ జీసీసీ పాలసీ 4.0 తీసుకొచ్చినట్టు వివరించారు. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు నేడు ప్రపంచ వ్యాపారరంగంలో కీలకంగా మారాయని, సాంకేతిక వ్యాపార పరిభాషలో వీటిని గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అంటారన్నారు.

కొన్ని కీలక విధుల నిర్వహణకు బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) విదేశాల్లో ఏర్పాటు చేసే కేంద్రాలని, రిమోట్‌ వర్క్‌, హైబ్రిడ్‌ వర్క్‌ మరియు కో-వర్కింగ్‌ స్పేస్‌లవంటి అత్యాధునిక సర్వీస్‌ డెలివరీ మోడళ్లను ఏర్పాటు చేయడం పాలసీ లక్ష్యంగా వివరించారు. నూతన ఆవిష్కరణలు, గిగ్‌ ఎకానమీ, వ్యవస్థాపకత మరియు స్థిరమైన ఆర్థిక అభివృద్ధికై పెద్దఎత్తున సాంకేతిక ఆధారిత విద్యార్థులను, ప్రతిభావంతులైన వర్కు ఫోర్స్‌ను, సహాయక ప్రభుత్వ విధానాలతో సహా ఆంధ్రప్రదేశ్‌ యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి ఈ విధానం ప్రయత్నిస్తుందని చెప్పారు. స్వర్ణ ఆంధ్ర విజన్‌`2047లో భాగంగా రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన ‘‘ఒకే కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త’’ లక్ష్యానికి కట్టుబడి ఉందన్నారు. మౌలిక సదుపాయాలను సత్వరమే సృష్టించడానికి ప్రభుత్వం కో-వర్కింగ్‌ స్పేస్‌లు, పొరుగు వర్కుస్పేస్‌లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని భావిస్తోందన్నారు. ఇందుకు ప్రోత్సాహాకాలను కూడా పెద్దఎత్తున అందజేసేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. కో-వర్కింగ్‌ స్పేస్‌ అంటే ఒక సెంటర్‌ను ఏర్పాటుచేసి అక్కడే ఐటి కంపెనీ, షాపింగ్‌ కాంప్లెక్సు, ఎంటర్టైన్మెంట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, తిరుపతి, వైజాగ్‌, విజయవాడ, అమరావతి తదితర పెద్ద కేంద్రాల్లో పొరుగు వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పొరుగు వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లకు అనుబంధంగా గ్రామాల్లో, మండలాల్లో కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత పనిచేసే వాతావరణాన్ని ఈ సెంటర్ల ద్వారా కల్పించడం జరుగుతుంది. కనీసం 100 సీట్ల నుండి 10 వేల చదరపు అడుగులతో కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు అభివృద్ది పర్చేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

గరిష్టంగా రూ.2 వేలను ఒక చదరపు అడుగుకు రాయితీగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. పొరుగు వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లలో కనీసం వేయి చదరపు అడుగుల అభివృద్ది పర్చిన ఏరియాతోపాటు కనీసం పది సీట్లుంటే పెట్టుబడిలో 50 శాతం రాయితీతోపాటు రూ.1,000/- లు ఒక చదరపు అడుగుకు రాయితీగా ఇస్తామన్నారు. ప్రతి సీటుకు రూ.1,000/-ల చొప్పున ఆరు మాసాల్లో ప్రోత్సాహకాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. 5 లక్షల చదరపు అడుగుల ప్లోర్‌ ఏరియా పైబడిన ఐటి క్యాంపస్‌ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ, ఐదేళ్లలో రూ.2,000/- ప్రతి స్వేర్‌ ఫీట్‌కు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకొచ్చినట్టు వివరించారు. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుపర్చాలనే లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించామన్నారు. ఈ పాలసీ అట్టడుగుస్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను గ్లోబల్‌ మార్కెట్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు, వారు అత్యధిక జీత భత్యాలను పొందేందుకు దోహదపడుతుందని మంత్రి కొలుసు వివరించారు.

ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ పాలసీ:
ఈ పాలసీ కింద చేసిన ప్రతిపాదనలకు మంత్రిమడలి ఆమోదం లభించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం ఇది. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్‌, గార్మెంట్స్‌ పాలసీని రూపొందించారు. 2024 -2029 కాలంలో రాష్ట్రంనుంచి వస్త్ర ఎగుమతుల్ని వన్‌ బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన రాష్ట్రంలో ఈ రంగంలో మంచి నైపుణ్యం కలిగిన పద్మశాలీలు, చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పాలసీ దోహదపడుతుంది. ఇందుకై అవసరమైన మౌలిక వసతులతో పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు, రాయితీలనూ పెద్దఎత్తున ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) ఐదు కొత్త సమగ్ర టెక్స్‌టైల్‌ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్‌ఎంఇలకు 30 శాతం, మధ్యతరహా పార్కులకు 20 శాతం, భారీ పార్కులకు 25 శాతంమేర పెట్టుబడి రాయితీ అందించనున్నారు.

మౌలిక వసతులు మరియు పెట్టుబడులు:
ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ పాలసీ 4.0 (2024-29) ప్రతిపాదనకు మంత్రిమండలి ఓకే చెప్పింది. 975 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచస్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్దిపర్చాలనే లక్ష్యంతో మారిటైమ్‌ పాలసీని రూపొందించారు. ఈ విషయంలో గుజరాత్‌ ప్రథమ స్థానంలోను, ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నది. సరుకు రవాణా విషయంలో ఏడాదికి గుజరాత్‌ 450 మిలియన్‌ టన్నులు చేస్తుంటే, మన రాష్ట్రంలో కేవలం 180 మిలియన్‌ టన్నులను మాత్రమే చేయడం జరుగుచున్నది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితోపాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమను కూడా అభివృద్దిపర్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఒక మెగా షిప్‌ యార్డును ఏర్పాటు చేసేందుకు ప్రధానితో సీఎం చర్చిస్తున్నారని మంత్రి కొలుసు వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైం హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నారు..

పంచాయితీ రాజ్‌ మరియు గ్రామీణాభివృద్ది శాఖ
జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, పులివెందుల, డోన్‌ సెగ్మెంట్లలో మూడు నీటి సరఫరా ప్రాజెక్టుల ధర సర్దుబాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తక్కువ వర్షపాతం, కరువు కారణంగా అక్కడ నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ 3 నీటి సరఫరా ప్రాజెక్టులను కొనసాగించడం ద్వారా నీటి సమస్యలను అధిగమించడం జరుగుతుంది. దీని ద్వారా 10.37 లక్షలమంది ప్రజలకు త్రాగునీటి సమస్య తీరనుంది.

గృహ నిర్మాణం:
పీఎంఏవై అర్బన్‌ 1.0 పథకం కొనసాగింపు మరియు ప్రస్తుత యూనిట్‌ ధరతో ఇళ్లను పూర్తి చేయడం, 3 ఎంపికల కింద నిర్మాణంలో ఉన్న పద్ధతి, మెటీరియల్‌ సరఫరా, కొత్త ఇసుక విధానాన్ని అనుసరించడం మరియు డ్రోన్‌లను ఉపయోగించి పెద్ద లేఅవుట్‌లలో నాణ్యత పరీక్ష నిర్వహించడం, హౌసింగ్‌ కాలనీలలో మౌలిక సదుపాయాలను చేపట్టడానికి చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదించింది. 2024 డిసెంబరు నాటికి ఈ పథకాల కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు 2026 మార్చి వరకూ గడువు ఇవ్వడం జరిగింది. అర్బన్‌లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లును పూర్తి చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ ఆయుర్వేద మరియు హోమియోపతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌, 1956 బోర్డుల నామకరణాన్ని మార్చడంతోపాటు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ యాక్ట్‌ 2020కి అనుగుణంగా బోర్డును పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పిలవబడుతున్న ఆంధ్రా బోర్డు ఆఫ్‌ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా పిలుస్తారు. అలాగే ఆంధ్రా బోర్డు ఫర్‌ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోమియోపతిగా పిలుస్తారు.

యూత్‌ అడ్వాన్సుమెంట్‌, టూరిజం అండ్‌ కల్చర్‌:
ఆంధ్రప్రదేశ్‌ టూరిజం పాలసీ 2024-2029 యొక్క సమగ్ర విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టేలా.. భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకుతోడు ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్‌, ఎకో, అడ్వెంచర్‌, వెల్‌నెస్‌, అగ్రి టూరిజంలను కలుపుతూ టూరిజం సర్య్కూట్లను ఏర్పాటు చేయనున్నారు.. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుంది. అలగే, రాజధాని అమరావతిని ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీకి ఆమోదం లభించింది. ఈ పాలసీ ద్వారా రూ.30వేల కోట్లు పెట్టుబడులు, దాదాపు 60వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలుపై వివిధ రాయతీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక పౌరసేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్‌-టైమ్‌ గవర్నెన్స్‌ 4.0 అమలుకు ఆమోదం లభించింది. వాట్సాప్‌ ద్వారా అనేక దృవీకరణ పత్రాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డాటా ఇంటిగ్రేషన్‌, అనలటిక్స్‌ మరియు గవర్నెన్సు హబ్‌గా తీర్చిదిద్దడం, ప్రోడక్టు డెవలప్‌మెంట్‌ హబ్‌, మల్టీసోర్సు విజ్యువల్‌ ఇంటెలిజెన్సు హబ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సు మరియు డీప్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌, పీపుల్స్‌ పెర్షప్షన్‌ హబ్‌ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకై అవేర్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.

డిసెంబరు 15న ఆత్మార్పణ దినోత్సవం.:
ఏటా డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ‘‘ఆత్మర్పణ దినోత్సవం’’గా పాటించాలని, రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదించింది. శ్రీరాములు జీవిత చరిత్రను నేటి తరానికి తెలిపే విధంగా ఒక లఘు చిత్రాన్ని రూపొందిస్తామని, ఆయన జన్మస్థలంలోని వారి ఇంటిని ఒక మంచి మ్యూజియంగా తయారు చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే, జల జీవన్‌ మిషన్‌ పున:ప్రారంభానికి కేబినెట్‌ ఆమోదించింది. రూ.51 వేల కోట్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆ ప్రాజెక్టు పున:ప్రారంభానికి ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం తీసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల క్రితమే ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంవల్ల రాష్ట్రంపై ఎంతో ఆర్థిక భారం పడిరదని మంత్రి కొలుసు వివరించారు.

శరవేగంగా అమరావతి పనులు
మున్సిపల్‌ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2014-19 మధ్య కాలంలో అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అనేక పనులు చేపట్టి కొంతమేరకు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతి అభివృద్ధి పనులను ప్రక్కన పడేసిందన్నారు. గత ఐదేళ్లూ ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. పనులు ఆగినా ఏజెంట్లను అలాగే ఉంచారు. వారి మిషనరీ ఇక్కడే ఉండిపోయింది. అప్పట్లో ఇచ్చిన టెండర్ల రేటుకు ఇప్పడు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. సుమారు రూ.286.78 కోట్ల డ్యామేజ్‌ జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన ఆరు మాసాల్లోనే అనేక కమిటీలు వేసి అభివృద్ది పనుల నిర్వహణకు ఆటంకాలను, చట్టపరమైన సమస్యలను పరిష్కరించిందన్నారు. ఈ నేపథ్యంలో రూ.11,471 కోట్ల పనులకు పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన వాటిని కేబినెట్‌ ఆమొదించిందన్నారు.

నిర్మాణ పనులు మళ్లీ చేపడుతుండటం వల్ల భారంతోపాటు రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. అమరావతి రాజధానిలో ట్రంక్‌ రోడ్డు, లే అవుట్‌ రోడ్ల నిర్మాణాలు వంటి చాలా పనులను చేపట్టడం జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వంలో పనులు చేయకపోగా ఉన్న రోడ్లను, ఏసీలు, డోర్‌లను తీసుకువెళ్లిపోయారన్నారు. ఇప్పడు టెండర్లు పిలవడం వల్ల జీఎస్టీ రూ.452.35 కోట్లు పెరిగిందన్నారు. 360 కిలోమీటర్లు ట్రంక్‌ రోడ్లకు ఎస్టిమేషన్‌ రూ.460 కోట్లు పెరిగాయన్నారు. 1200 కిలో మీటర్లు లే అవుట్‌ రోడ్లు, 3600 అపార్ట్‌మెంట్లు కూడా ఈ నిర్మాణ పనుల్లో ఉన్నాయన్నారు.
అడ్మినిస్ట్రేటివ్‌ టవర్స్‌, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామన్నారు. అప్పట్లో రూ.41 వేల కోట్లు బడ్జెట్‌గా వేస్తే ఇప్పడు 30 శాతం పెరిగిందన్నారు. ఏదేమైనా ఇప్పుడు చేపడుతున్న నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తిచేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి నారాయణ వివరించారు.

Previous Post

రూ.11,467 కోట్లతో రాజధాని పనులు

Next Post

కాకినాడ పోర్టు, సెజ్‌ ఆక్రమణపైసీఐడీ విచారణ: సీఎం చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist