- ప్రధాని మోదీ సంతాపం
- నారా రోహిత్‌కు లేఖ
అమరావతి (చైతన్యరథం): సినీ నటుడు నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేశారు. సీఎం చంద్రబాబు సోదరుడు, రోహిత్ తండ్రి నారా రామూర్తినాయుడు గత శనివారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి నుంచి రోహిత్‌కు లేఖ రాశారు. రామ్మూర్తినాయుడి మరణవార్త తెలిసి చాలా బాధకు గురయ్యానని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఆయన లేని లోటును భర్తీ చేయలేమని చెప్పారు. ప్రజాప్రతినిధిగా సామాన్య ప్రజల సమస్యలు, ఆకాంక్షలపై రామ్మూర్తి గళం వినిపించారని ప్రధాని కొనియాడారు. ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఆయన భౌతికంగా దూరమైనా… అందరి హృదయాల్లో నిలిచే ఉంటారన్నారు. రోహిత్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ కష్టకాలంలో మీకు మరింత శక్తిని అందించాలని భగవంతుడిని కోరుతున్నానని తెలిపారు.