- టీడీపీపై కక్షతోనే గత ప్రభుత్వం వివక్షతో వ్యవహరించింది
- కాంట్రాక్టర్లకు బకాయిలు రూ.540 కోట్లు చెల్లించలేదు
- ఇళ్లకు రంగుల మార్పు పేరుతో రూ.300 కోట్లు వృథా
- 2,38,360 ఇళ్లను రద్దు చేసి లబ్ధిదారులను తొలగించింది
- వారికి ఇవ్వాల్సిన రూ.349 కోట్లు ఇవ్వకుండా హింసించింది
- బ్యాంకు రుణాలు పొందిన 40,571 మందికి ఇళ్లు కేటాయించలేదు
- రూ.5200 కోట్లు అవసరం…త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం
- శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి(చైతన్యరథం): టీడీపీపై కక్షతో గత ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు త్వరలోనే పరిష్కరించేలా ముందు కెళుతున్నామని వెల్లడిరచారు. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లపై తీసుకున్న రుణాలకు సంబంధించి శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం వివిధ రూపాల్లో రూ.5546.48 కోట్లు రుణం తీసుకుంది.. వివిధ సంస్థల ద్వారా రూ.3175.61 కోట్లు, లబ్ధిదారుల పేరు మీద రూ.2184.86 కోట్లు, పట్టణ ప్రణా ళికా విభాగంలోని ఎల్ఆర్ఎస్ నిధులు రూ.195.81 కోట్లు రుణంగా తీసు కుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,01,480 ఇళ్లకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుని 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చాం..వీటిలో 3,13,832 ఇళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రౌండ్ అయ్యాయి. గత ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో మొత్తం 5 లక్షల ఇళ్లలో 2,38,360 ఇళ్లను రద్దు చేసి కేవలం 2,61,660 ఇళ్లు మాత్రమే టేకప్ చేసిందని వివరించారు.
లబ్ధిదారులపై బ్యాంకుల ఒత్తిడితో ఇబ్బందులు
సీఎం చంద్రబాబు పేదవారికి సైతం గేటెడ్ కమ్యూనిటీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించడంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైక్వాలిటీతో హై టెక్నా లజీ గత షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల కోసం నిర్మించే ఇళ్లకు టేక్ వుడ్‌తో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశాం. కిచెన్‌లో స్టెయిన్ లెస్ స్టీల్ సింక్, అటకలు, కప్ బోర్డులు, ఏ గ్రేడ్ వర్టిఫైడ్ టైల్స్‌తో ఫ్లోరింగ్, స్టీల్ విండోస్, కమ్యూనిటీ హాల్, లిఫ్ట్, అవుట్ పోస్ట్ పోలీసుస్టేషన్ తో పాటు ఇళ్ల మధ్య పెద్ద పెద్ద రోడ్లు ఉండేలా నిర్మాణం చేపట్టాం. అయితే గత ప్రభుత్వం చిన్న చిన్న రోడ్లు ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం చేసిన పనులతో లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు.
అంతేకాకుండా రెండు రకాల ఇళ్లకు లబ్ధిదారులు చెల్లించే డబ్బు ను తగ్గిస్తున్నామని చెప్పడంతో వారికి ఇవ్వాల్సిన పెండిరగ్ బకాయిలు కూడా ఇవ్వ కుండా మోసం చేయడంతో ఇప్పటికీ లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి చెప్పారు. మొత్తం 2,61,590 మందికి రూ.349 కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మరో 77,606 మంది రూ.2275.24 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పటికీ వారిలో 40,571 మందికి ఇళ్లు ఇవ్వలేదు..ఇప్పుడు బ్యాంకులు వచ్చి ఈఎంఐ చెల్లించాలని అడుగుతుండటంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రూ.5200 కోట్లు అవసరం…త్వరలోనే పరిష్కరిస్తాం
ఇలా గత ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఒక్క శాతం కూడా చేయకుండా లబ్ధిదారు లను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది.. టీడీపీ ప్రభుత్వంలో ఎంపిక చేసిన 3,80, 000 మంది లబ్ధిదారులలో చాలామందిని తొలగించింది..ఇలా తొలగించిన లబ్ధిదారులకు వారు చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉందని వివరించారు. మరోవైపు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.540 కోట్ల బిల్లులు పెండిరగ్లో ఉన్నాయి. టిడ్కో ఇళ్లకు ఒక్కో ఏరియాలో ఒక్కో కలర్ వేశాం. కానీ రంగులు మార్చడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.300 కోట్లు వృథా చేసిందని వివరించారు. అయితే టిడ్కో లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పనకు రూ.5200 కోట్లు ఖర్చవుతుం దని, త్వరలోనే పరిష్కరించేలా ముందుకెళుతున్నామని స్పష్టం చేశారు.