- వైద్యఆరోగ్య అవుట్ సోర్స్ ఉద్యోగుల హర్షం
- డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ధన్యావాదాలు
అమరావతి(చైతన్యరథం): అవుట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగా ల్లో చేరాం.. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా విధు లు నిర్వహిస్తున్నాం.. విధుల్లో చేరిన నాటి నుంచి వేతనాలు లేవు.. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నాం.. మేము పనిచేసిన కాలానికి జీతాలు ఇప్పించండి.. ఉద్యోగ భద్రత కల్పించండి అంటూ గత నెలలో మంగళగిరిలో పవన్‌కళ్యాణ్‌కు ఆ శాఖ అవుట్ సోర్స్ ఉద్యోగులు సమస్య చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన పవన్‌కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడంతో మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను నాలుగు వారాలలోపు పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.