- మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం..మంచి ప్రభుత్వం
- మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట
- ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్‌రెడ్డికే దక్కింది
- సీమను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలబెట్టడమే బాబు లక్ష్యం
- రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్
- హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీ, మండలి ఏకగ్రీవ ఆమోదం
అమరావతి(చైతన్యరథం): ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని, రాయలసీమ ప్రాంత ముఖద్వారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు శాసనసభ, శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ పేర్కొన్నారు. గురువారం శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రభు త్వం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టింది. ఇందులో అత్యంత కీలకమైన కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ప్రతిపాదిస్తూ మంత్రి ఫరూక్ శాసనసభ, శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మం త్రి ఫరూక్ మాట్లాడుతూ రాయలసీమను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధి లోనే హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేసిన వెంటనే శాసనసభ, శాసనమండలిలో కూడా తీర్మానంను ప్రవేశపెట్టి ఆమోదిం చడంపై రాయలసీమ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందన్నారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానాన్ని గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి పంపి అతి త్వరలోనే బెంచ్ ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడిరచారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు శాశ్వత బెంచ్‌కు కేటాయించడం ద్వారా ఇప్పటివరకు న్యాయ సేవల్లో ఉన్న కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఏపీ రాష్ట్ర మొత్తం జనాభా దాదాపు 5 కోట్లు ఉండగా రాయలసీమలో 1.60 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 43 శాతం, జనాభాలో 32 శాతం మంది రాయలసీమ ఉందని తెలిపారు. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్ట్ బెంచ్‌లు ఏర్పాటై కొనసా గుతున్నాయని పేర్కొన్నారు. ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా న్యాయ పరిపాలన సౌలభ్యం కోసం హైకోర్టు శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రజాభీష్టాన్ని నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకుందని వెల్లడిరచారు.
కేంద్రానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానం
ఎన్నికలకు ముందు రాయలసీమ ప్రజానీకానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేయా లని నిర్ణయం తీసుకోడమే కాకుండా వేగంగా బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలను ప్రారంభిం చి శాసనసభ, శాసనమండలిలో తీర్మానించి కేంద్రానికి పంపుతున్నట్లు చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించినప్పుడు న్యాయవాదులు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తెలు పగా అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆనాడు నారా లోకేష్ హామీ ఇచ్చారని ఫరూక్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో హైకోర్టు ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందేనని…
అయితే రాయలసీమ జిల్లాల నుంచి నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం సరిగ్గా లేని పరిస్థితులు కారణంగా ఇప్పటివరకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో న్యాయపరమైన సేవలు రాయలసీమ ప్రజల చెంతకు చేరను న్నాయని తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తీర్మానాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా రాయలసీమ వాసిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హోదాలో శాసనసభ, శాసనమండలి లో ప్రవేశపెట్టడం, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞత లు తెలుపుతున్నట్లు చెప్పారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ మభ్యపెట్టారు
2014-2019 టీడీపీ ప్రభుత్వం హయాంలో కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు, కర్నూలును న్యాయ రాజధాని అంటూ ప్రగల్బాలు పలికి రాయలసీమ ప్రాంత ప్రజలను మభ్య పెట్టారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, 30 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. ఏపీలో అన్ని రాజ్యాం గ వ్యవస్థలను భ్రష్టు పట్టించి అరాచక పాలన సాగించిన ఘనత గత ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వేదికను కూల్చడం నుంచి రివర్స్ టెం డరింగ్ పేరుతో పనులను నిలిపివేయడం, ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేసే రాజకీయాలకు గత ప్రభుత్వం పాల్పడిరదని ధ్వజమెత్తారు. దాని ఫలితంగానే 11 సీట్లను ఇచ్చి రాష్ట్ర ప్రజానీకం తిరుగులేని విధంగా ఓటుతో బుద్ధి చెప్పిందన్నారు.
ఐదేళ్ల గత ప్రభుత్వ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కేవలం 150 రోజులలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు చర్యలు, పాలనాపరమైన విధానంలో సమగ్ర మార్పులు చూసిన రాష్ట్ర ప్రజలంతా తాము తీసుకున్న నిర్ణయానికి సార్ధకత లభించిం దని సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకు పూర్వ వైభవం రానున్నదని, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని సీమ ప్రాంత ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. రాయలసీమ జిల్లాల న్యాయపరమైన కేసుల కోసం కర్నూలు లో ఏర్పాటు అవుతున్న హైకోర్టు శాశ్వత బెంచ్ కారణంగా కష్టాలు తొలగనున్నాయని, కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించిందని వివరించారు.