- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ
- ఏపీ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం
- జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు
అమరావతి(చైతన్యరథం): ఇకపై ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా ఏపీ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024 కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నాలుగురోజుల క్రితమే పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ సభలో ప్రవేశపెట్టారు. తాజాగా సోమ వారం బిల్లు ఆమోదం కోసం ఆయన ప్రతిపాదించిన వెంటనే ఎలాంటి చర్చా లేకుం డానే ఆమోదం పొందింది. మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు గత నేపథ్యాన్ని పరిశీలిస్తే 1960 దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుం బ నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి. కుటుంబ నియంత్రణలో భాగంగా తీసుకు న్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనర్హులుగా చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. 1955 మున్సిపల్ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షన్ 21 బీ, అలాగే 1965 మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ 13బీలను చొప్పిస్తూ ఏపీ మున్సిపల్ శాస నాల సవరణ బిల్లు 1994ను తీసుకొచ్చారు. 1994లో జరిగిన ఈ సవరణల ప్రకా రం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న వారు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అప్పటినుంచి ఇదే విధానం కొనసాగుతూ వస్తుంది. అయితే గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు బాగా తగ్గిపోయింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిపోయింది. జనన,మరణాల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడి పోయింది. అదే సందర్భంలో జనాభా వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది. వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉంది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభా పెరుగు దల ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేయా ల్సి వచ్చింది. దీని ప్రకారం గతంలో ఆయా చట్టాల్లో చేసిన సవరణలకు సంబం ధించిన సెక్షన్లను తొలగిస్తూ ఏపీ మున్సిపల్ శాసనాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.