- దారికి తెచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నాం
- చంద్రబాబు చొరవతోనే గట్టెక్కాలి
- అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి (చైతన్యరథం): గత వైసీపీ పాలన పాపాల పుట్టగా సాగిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు శుక్రవారం అసెంబ్లీలో మంత్రి కేశవ్ సమాధానం ఇస్తూ జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అరాచకాలను ఎండగట్టారు. బడ్జెట్ పెట్టలేదు పెట్టలేదని పదేపదే వైసీపీ నేతలు అన్నారు. అసలు బడ్జెట్ పెట్టడానికి వీలు లేని విధంగా ఆర్థిక పరిస్థితిని మీరు దిగజార్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రతికూలంగా పనిచేశాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో దిగిపోయిన రోజు అప్పులు రూ. 3 లక్షల 75 వేల కోట్లు. జగన్ ప్రభుత్వం దిగిపోయినప్పడు ఉన్న అప్పులు రూ. 9లక్షల 70 వేల కోట్లు. అంటే దాదాపు రూ.10 లక్షల కోట్లు. అప్పులు వివిధ పద్దుల కింద ఉంటాయి. తెచ్చిన ప్రతి రూపాయిలో 60శాతం మూలధన వ్యయంగా టీడీపీ హయాంలో ఖర్చు చేశాం. జగన్ తెచ్చిన అప్పుల్లో 22 శాతం మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 1600 కోట్లతో పట్టిసీమ కడితే ఐదేళ్లలో రూ. 44 వేలకోట్ల మేర పంట ఉత్పత్తులు తెచ్చిపెట్టింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యక్తిగత సంపదను పెంచడం మాత్రమే తెలుసు. రాష్ట్ర సంపదను పెంచడం వారికి చేతకాదని మంత్రి పయ్యావుల అన్నారు.
ఆర్థిక ఉగ్రవాది జగన్ ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు నిర్విరామంగా శ్రమిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో అర్థం కావట్లేదు. ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగింది. దేనికీ సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవు. గత ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుదారి పట్టించింది. ఇప్పుడు కూడా అంకెల గారడీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పెండిరగ్‌లో బిల్లులు
కాంట్రాక్టర్ల బిల్లులను పెండిరగ్ లో పెట్టారు. గత ప్రభుత్వ వైఖరితో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండిరగ్లో పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మేం వచ్చాక సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టింది. పోలవరం పనులు నిలిపివేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారణమయ్యారు. రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు. సూట్‌కేస్ కంపెనీలు.. బ్రీఫ్ కేస్ కంపెనీలు.. క్విడ్ ప్రో కో పదాలు పరిచయం చేశారు. గత పాలకులు చేసిన ఇసుక, మద్యం మాఫియా అందరికీ తెలుసు.
చట్టసభల అనుమతి లేకుండానే..
చట్టసభల అనుమతి లేకుండా రూ.634 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ చెప్పింది. అనుమతి లేని ఖర్చులు ఎవరి కోసం చేశారు? ఎందుకు చేశారు? వైకాపా హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయారు. చంద్రబాబు వచ్చాక మళ్లీ అనేక మంది వస్తున్నారు. అమరావతి విధ్వంసం.. విశాఖ భూ దోపిడీ మీ అరాచకం కాదా? సంక్షేమం.. అభివృద్ధి.. బ్యాలెన్స్ చేసుకుంటూ బడ్జెట్ ప్రవేశపెట్టాం. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారు. అమెరికా పర్యటనలో ఆయన 90 మంది పారిశ్రామికవేత్తలను కలిశారని మంత్రి పయ్యావుల తెేలిపారు.
కేంద్ర పథకాలకు జగన్ పగనామం
కేంద్రం ఇచ్చిన 93 పథకాలకు జగన్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 100శాతం గ్రాంట్ ఇచ్చే పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఆపేసిందన్నారు. ఇప్పడు ఒక్కో పథకం పునరుద్ధరించడానికి నానా అగచాట్లు పడాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. గతంలో అప్పుల కోసం చేయని తప్పు లేదన్నారు. పొరుగు రాష్ట్రాలు 8శాతం వడ్డీకి తెస్తే వీరు 10.50 శాతానికి చేశారన్నారు.