అమరావతి (చైతన్యరథం): బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. చిరునవ్వుల చిన్నారులు..భావిభారత చిరుదివ్వెలు.. బాలబాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విద్యాశాఖ మంత్రిగా బాధ్యత దక్కడం నా అదృష్టం. పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతూ, వారి హక్కులు కాపాడటానికి శక్తి వంచన లేకుండా పనిచేయడమే బాలబాలికలకు తాను ఇస్తున్న చిల్డ్రన్స్ డే కానుకగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.