- ఏఐ ఆధారిత పరిశ్రమలకు యువతకు శిక్షణ ఇవ్వండి
- సేల్స్‌ఫోర్స్ సీఈవో క్లారా షిప్ాతో మంత్రి నారా లోకేష్ భేటీ
లాస్ వెగాస్ (యుఎస్ఎ): అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. తాజాగా లాస్ వెగాస్‌లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సేల్స్‌ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిప్ాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై మేం దృష్టిసారించాం..ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయాలి..సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యాసంస్థలతో భాగస్వాములు కావాలి..ఏపీ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు ఏఐ టూల్స్, మెంటార్షిప్ను అందించాలని కోరారు. టెక్ స్టార్టప్‌లలో నవీన ఆవిష్కరణల కోసం మీ వ్యవస్థాపక స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు అనుగుణంగా ఉందని తెలిపారు.
ఐన్‌స్టీన్ ఏఐని రాష్ట్రంలో పరిచయం చేయండి
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం)ను మెరుగుపరచ డానికి సేల్స్‌ఫోర్స్ యొక్క ఐన్‌స్టీన్ ఏఐని రాష్ట్రంలో పరిచయం చేయండి. ఏఐ – పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగు పర్చేం దుకు సహకారం అందించండి. ఈ-గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపరచడం, ప్రిడిక్టివ్ అనలి టిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారం కోరుతున్నాం. పరిపాలనలో ఏఐ, డిజిటల్ ట్రాన్సఫర్మే షన్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఏపీలో అమలయ్యే స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు.
నైతికతతో కూడిన ఏఐపై దృష్టి సారించాం
ఈ సందర్భంగా క్లారా షిప్ా మాట్లాడుతూ సేల్స్‌ఫోర్స్ ఏఐ వ్యూహ పర్యవేక్షణ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఆఫర్లను మెరుగుపర్చడం, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్‌లో నవీన ఆవిష్కరణలపై మేం దృష్టి సారించాం. ఐన్‌స్టీన్ ఏఐ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధికి కసరత్తు చేస్తున్నాం. కస్టమర్ మనోభీష్టానికి అనుగుణంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యాపార విధుల్లో ఆటోమేషన్ కోసం ఏఐ టూల్స్ రూపొందించడం వంటి సేవలు అందిస్తున్నాం. సేల్స్‌ఫోర్స్ ఏఐ సంస్థ నైతికతతో కూడిన కృత్రిమ మేధపై దృష్టి సారిస్తుంది. ప్రభుత్వ రంగ ప్రాజెక్టులలో బాధ్యతాయుతమైన ఏఐ వినియో గానికి మేం కట్టుబడి ఉన్నాం. ఏఐ అండ్ ఎంఎల్ నవీన ఆవిష్కరణల్లో దూసు కుపోతున్న తమ సంస్థ ప్రస్తుతం 287 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో మాట్లాడతానని పేర్కొన్నారు.