- అంచనాలకు మించి అనూహ్య స్పందన
- 2 రోజుల సదస్సుకు 11వేలమంది హాజరు
- సహకరించిన అందరికీ ధన్యవాదాలు
- ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె దినేష్కమార్
అమరావతి (చైతన్య రథం): రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ `2024 అంచనాలకు మించి విజయవంతమైందని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె దినేష్ కుమార్ తెలిపారు. రెండు రోజుల సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులపాటు జరిగిన సదస్సుకు ప్రతినిధులతోపాటు సందర్శకులు భారీసంఖ్యలో హాజరయ్యారన్నారు. రెండు రోజులుపాటు మొత్తం 11 వేలకు పైగా సదస్సును, సదస్సులో ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శనను సందర్శించారని వెల్లడిరచారు. సదస్సులో 4 వేలమందికిపైగా పాల్గొన్నారని, నాలుగు కీలకోపన్యాసాలతో పాటు మొత్తం 62మంది వివిధ రంగాలకు చెందిన మేధావులు ప్యానెల్ స్పీకర్లుగా పాల్గొని అమూల్యమైన సలహాలు, సూచనలిచ్చారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా డ్రోన్ సదస్సు నిర్వహించామని, ఈ సదస్సు విజయవంతానికి వెన్నుతట్టి ప్రోత్సహించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్నాయుడు, రాష్ట్ర పెట్టుబుడులు మౌలిక సదుపాయాల కల్పన మంత్రి బీసీ జనార్థనరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సదస్సు విజయవంతం చేయడంలో అలుపెరుగని కృషి చేసిన ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, ఏపీ ఫైబర్ నెట్, డ్రోన్ కార్పొరేష్, ఆర్టీజీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతమయ్యేలా తమ సహకారం అందించిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి సదస్సు తమకెంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందని దినేష్‌కుమార్ ధన్యావాదాలు తెలిపారు.