చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

ప్రజాకోర్టులో తీర్పు వచ్చింది..ఇక విశాఖ కోర్టులోనే రావాలి

` విశాఖలో మీడియాతో మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Aug 30, 2024 at 6:45am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ప్రజాకోర్టులో తీర్పు వచ్చింది..ఇక విశాఖ కోర్టులోనే రావాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి
  • తదుపరి విచారణ అక్టోబర్‌ 18కి వాయిదా
  • విశాఖ కోర్టుకు సొంత ఖర్చులతోనే వచ్చానన్న లోకేష్‌
  • వైసీపీ రాసలీలల్లో అధికారులు కూడా భాగస్వాములయ్యారని వ్యాఖ్య
  • భూ అక్రమాలన్నీ బయటకు తీస్తామని స్పష్టీకరణ
  • విశాఖను ఏఐ రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ
  • స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడతామని పునరుద్ఘాటన

విశాఖపట్నం(చైతన్యరథం): ప్రజాకోర్టులో ఎన్డీయే కూటమికి బ్రహ్మాండమైన తీర్పు వచ్చిందని.. ఇక విశాఖ జిల్లా కోర్టులోనే తీర్పు రావాల్సి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం గురువారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్‌ 18కి వాయిదా వేసింది. ‘‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’’ పేరుతో సాక్షి పత్రిక 2019 అక్టోబర్‌ 22న అసత్య కథనం ప్రచురించింది. దీంతో అవాస్తవాలతో తన ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చారంటూ నారా లోకేష్‌ సాక్షి పత్రికపై రూ.75 లక్షలకు పరువునష్టం దావా వేశారు.
టీడీపీకి అధికారం కొత్త కాదు
కోర్టు విచారణ అనంతరం మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. గతంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే తనపౖౖె సాక్షి విశాఖ ఎడిషన్‌ లో అవాస్తవాలతో కూడిన కథనం ప్రచురించారన్నారు. విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో తాను టీ, కాఫీల కోసం రూ.25 లక్షలు ఖర్చుచేశానని రాశారు. సాక్షి పత్రికలో పెట్టుబడులు మొత్తం వైఎస్‌ కుటుంబానివే. ఢల్లీిలో ఉన్న వీక్లీ మేగజైన్‌ కూడా అసత్యాలతో కూడిన కథనం ప్రచురించింది. దీనిపై ఆధారాలతో సహా ఇరువురికి లీగల్‌ నోటీసులు పంపించాను. బిల్లులు జనరేట్‌ అయిన 26 రోజుల్లో నేను ఒకే ఒక్క రోజు విశాఖలో ఉన్నానని స్పష్టంగా తెలియజేశాను. వీక్లీ మేగజైన్‌ తన తప్పుడు కథనంపై సవరణ వేసి, క్షమించమని కోరింది. సాక్షి పత్రిక మాత్రం ఒప్పుకోలేదు. దీంతో రూ.75 లక్షలకు సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేశాను. టీడీపీకి అధికారం కొత్త కాదు. ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని మా నాయకుడు చంద్రబాబునాయుడు పదేపదే చెబుతారని మంత్రి లోకేష్‌ అన్నారు.
విశాఖ కోర్టుకు నా సొంత ఖర్చులతోనే వచ్చాను
గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలనే వినియోగించాను. వాటర్‌, టీ ఖర్చుకు కూడా నేను డబ్బులు చెల్లించాను. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత, ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే వచ్చాను. డీజిల్‌ ఖర్చు కూడా నా జేబు నుంచే చెల్లిస్తున్నాను. విమానానికి కూడా నా సొంత డబ్బులే ఖర్చు పెట్టాను. ఒక కప్పు కాఫీ తాగను, ఒక బాటిల్‌ నీళ్లు కూడా ప్రభుత్వం నుంచి ఏనాడూ తీసుకోలేదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విలువలు అవి. బుధవారం రాత్రి కూడా విశాఖ పార్టీ కార్యాలయంలో నా సొంత బస్సులోనే నిద్రించాను. జగన్‌ రెడ్డి మాదిరిగా ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు మేం వినియోగించం. సిగ్గులేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక తరపున వచ్చిన న్యాయవాదులు వాదనలు వినిపించడం చాలా బాధాకరం. చిన్నబాబు చిరుతిండి రూ.25 లక్షలంటూ కథనంలో ఆరేడుసార్లు నా పేరు ప్రస్తావించారు. ఆ డబ్బును చంద్రబాబు అకౌంట్‌లో వేశానని కూడా రాశారు. ఒక కథనం ప్రచురించే ముందు పరిశోధన చేయాలి. నా వివరణ తీసుకుని ఉంటే వాస్తవాలు చెప్పేవాడిని. సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షిలో అసత్య కథనం ప్రచురించారు. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్‌ పడాలనే పరువు నష్టం దావా వేశానని మంత్రి లోకేష్‌ తెలిపారు.
జగన్‌ రెడ్డిలాగా నాకు ప్రజాధనం లూటీ చేయడం రాదు
జగన్‌ రెడ్డిలాగా నాకు ప్రజాధనం లూటీ చేయడం రాదు. దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టారు. సర్వే రాళ్లపై జగన్మోహన్‌ రెడ్డి బొమ్మ కోసం సుమారు రూ.900 కోట్లు దుర్వినియోగం చేశారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేశారు, ఖర్చు చేశారు. నాడు-నేడు ఎప్పుడూ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ చేయదు. మేం మొదటి నుంచీ క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. ప్రజల కోసం కష్టపడతామని మంత్రి లోకేష్‌ చెప్పారు.
వైకాపా రాసలీలల్లో అధికారులు కూడా భాగస్వాములయ్యారు
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టను అని నేను స్పష్టంగా చెప్పా. వైసీపీలో జరుగుతున్న రాసలీలల్లో అధికారులు కూడా ఇన్‌వాల్వ్‌ అయ్యారని కథనాలు వచ్చాయి. వాటిపై ఎంక్వైరీ చేయాలి కదా. రెడ్‌బుక్‌ చూసి ఎందుకు భయపడుతున్నారు. నన్ను అడ్డుకునేందుకు గతంలో జీవో నెం.1 తీసుకువచ్చారు. మడిచి పెట్టుకోవాలని ఆనాడే చెప్పా. ఇవాళ రాష్ట్రంలో జగన్‌ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. విశాఖ రుషికొండ ప్యాలెస్‌ను ఏవిధంగా వినియోగించుకోవాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్‌ అన్నారు.
పద్ధతి ప్రకారమే సంస్కరణలు
గత ప్రభుత్వం నాడు-నేడు పేరుతో రూ.9వేల కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఇదంతా జగన్‌ రెడ్డి అసమర్థత వల్లే. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఐదేళ్లలో ఏం చేస్తామో ప్రజలముందు పెడతాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మదింపు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం. దీనిని ముందుకు తీసుకెళ్తాం. మన బడి-మన భవిష్యత్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సీబీఎస్‌ఈ విధానంపై గత ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించాం. సమీక్షించి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. సంస్కరణలు ఏం తీసుకువచ్చినా పద్ధతి ప్రకారం చేస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
విశాఖను ఏఐ కేపిటల్‌గా తీర్చిదిద్దుతాం
చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. పలువురు ఐటీ పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2019లో అదానీతో ఒప్పందం కుదుర్చుకుని సోలార్‌ ఎనర్జీ, డేటా సెంటర్‌ తీసుకువచ్చాం. ఆ రోజు ఎగతాళి చేశారు. ఇవాళ అవి మహారాష్ట్రకు, తెలంగాణకు తరలివెళ్లాయి. అందరితో మళ్లీ చర్చించాం. విశాఖను ఏఐ కేపిటల్‌గా తీర్చిదిద్దుతాం. విశాఖలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూఅక్రమాలపై విచారణ పూర్తిచేసి నివేదికను తదుపరి కేబినెట్‌లో పెడతాం. అన్ని భూఅక్రమాలు బయటకు తీస్తాం. జగన్‌ రెడ్డి మొదటి నిర్ణయమే ఏకపక్షంగా ప్రజావేదికను కూల్చారు. సింగపూర్‌ ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. లులూ ప్రాజెక్టును తరిమికొట్టారు. అందరినీ ఒప్పించి పరిశ్రమలు తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజలకు సంక్షేమం కూడా అందిస్తామని మంత్రి లోకేష్‌ అన్నారు.
విశాఖ స్టీల్‌ను కాపాడతాం
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను కాపడతామని హామీ ఇచ్చాం. ఈ విషయమై కేంద్రంతో ఇప్పటికే చర్చించాం. దీనిపై సమీక్షించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల పరిశ్రమకు కష్టాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుక, మైనింగ్‌ కుంభకోణాలు జరిగాయి. అవన్నీ బయటకు తీస్తాం. అక్రమ కట్టడాలు ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఐదేళ్లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

Previous Post

ఐదేళ్లలో మా గోడు విన్నవారు లేరు!

Next Post

నిండైన ఆత్మీయత, ఆత్మాభిమానానికి ప్రతిరూపం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

కార్యకర్త
@ March 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

కార్యకర్త
@ March 25, 2026
దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

చైతన్యరధం
@ March 24, 2026
ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక
ఆంధ్రప్రదేశ్

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

చైతన్యరధం
@ March 24, 2026
చంద్రబాబు అనే నేను చెబుతున్నా…
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చైతన్యరధం
@ March 24, 2026
ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ March 24, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

చైతన్యరధం
@ March 24, 2026
ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

చైతన్యరధం
@ March 24, 2026
చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చైతన్యరధం
@ March 24, 2026
ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ March 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist