అమరావతి(చైతన్యరథం): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం 9:15 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేస్తారు. రాష్ట్ర ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ఈ నెల 1వ తేదీన టోల్ ఫ్రీ నంబర్ 73062 99999ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెంబర్ ద్వారా ఇప్పటికే ఫిర్యాదులు చేసిన వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు చేసిన వారు శనివారం ఉదయం 9:15గంటల లోపు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవాలి. వారిని కలిసి ముఖ్యమంత్రి ఫిర్యాదులు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.