అమరావతి: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రజలకు ప్రణామం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ఆ నాడు సభలో చంద్రబాబు శపథం చేశారని.. ఈ రోజు అదే సభలో ముఖ్యమంత్రిగా అడుగిడారని పేర్కొన్నారు. గౌరవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారని పేర్కొంటూ ఓ వీడియోను తన పోస్టుకు జత చేశారు. అందులో రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన శపథంతో పాటు తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన విజువల్స్ ఉన్నాయి.
కాగా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తున్న కార్యక్రమాన్ని భువనేశ్వరి టీవీలో వీక్షించారు.