చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

అక్షర సూరీడుకి అంతిమ వీడ్కోలు

హాజరైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, అభిమానులు

by చైతన్యరధం
Jun 10, 2024 at 6:43am
in ముఖ్య వార్తలు
అక్షర సూరీడుకి అంతిమ వీడ్కోలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రామోజీ ఫిల్మ్‌సిటీ స్మృతివనంలో అంత్యక్రియలు
  • స్వయంగా పాడె మోసిన తెదేపా అగ్రనేత చంద్రబాబు
  • హాజరైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, అభిమానులు

ఇక సెలవు! అంటూ అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా ఆయన అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల ‘జోహార్‌ రామోజీరావు’ నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.

అమరావతి (చైతన్య రథం): మీడియా మొఘల్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో విషణ్ణ వదనాల మధ్య ఘనంగా ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని స్మృతివనంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అక్షర యోధుడి అంతమయాత్ర ప్రారంభమైంది. కడపటి చూపుతో కన్నీరు మున్నీరైన కుటుంబీకులు, మనుమడు సంజయ్‌ నివాళి అర్పించన అనంతరం పెద్దఎత్తున అంతిమయాత్ర మొదలైంది. రామోజీకి జోహార్లు పలుకుతూ, రామోజీ గ్రూప్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల మీదుగా అంతమ యాత్ర సాగింది. స్మృతివనం వరకూ సాగిన అంతిమయాత్రలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు రజత్‌ భార్గవ, సాయిప్రసాద్‌, ఆర్పీ సిసోడియా హాజరై లాంఛన ప్రక్రియను పూర్తి చేశారు. అంత్యక్రియలకు హాజరైన తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబు నాయుడు స్వయంగా రామోజీరావు పార్దివ దేహాన్ని ఉంచిన కాడె మోశారు. రామోజీ పార్దివ దేహం స్మృతివనం వద్దకు చేరగానే గాలిలోకి తుపాకులు పేల్చి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీరావు కుమారుడు, ఈనాడు ఎండీ సిహెచ్‌ కిరణ్‌ తండ్రి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో కుటుంబసభ్యులు కడపటి వీడ్కోలు పలికారు. జీవన మార్గదర్శికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, భాషాభిమానులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు అంతిమ సంస్కారాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్‌, కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, సుజనాచౌదరి, రఘురామకృష్ణరాజు, తెలంగాణ మంత్రి తుమ్మల, చింతమనేని ప్రభాకర్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, పట్టాభి, తుమ్మల, జూపల్లి, సీతక్క, ఎర్రబెల్లి, పోచారం, నామా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నలమోతు భాస్కర్‌ రావు, వేం నరేందర్‌ రెడ్డి, వెనిగండ్ల రాము, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, వి.హనుమంతరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత సురేష్‌ బాబు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. చెరుకూరి రామోజీరావు (88) శనివారం ఉదయం తెల్లవారుజామున అస్తమించడం తెలిసిందే. గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడిన ఆయనను హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్చడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50కు తుదిశ్వాస విడిచారు.
రామోజీ ప్రస్థానం:
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలో విద్యాభాస్యం కొనసాగింది. చిరు ఉద్యోగిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, చిన్న అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం ప్రకటనల రంగంలో పని చేసి 1962లో హైదరాబాద్‌ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ స్థాపించారు. మధ్య తరగతి కుటుంబాల్లో పొదుపు ఆవశ్యకతకు మార్గదర్శి ఎంతో బలం చేకూర్చింది. 1969లో అన్నదాత పత్రిక ప్రారంభించి రైతు సమస్యలు, సాగురంగం ఇబ్బందులు, మెళకువలను ముద్రించేవారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో స్థాపించిన ఈనాడు’ పత్రిక సంచలనాలను సృష్టించింది. ప్రాంతీయ దినపత్రికల చర్రితలో ‘ఈనాడు’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్రమంగా హైదరాబాద్‌ ఎడిషిన్‌తో పాటు జిల్లాల ఎడిషన్‌లూ ప్రచరించి సామాజిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్‌ అయింది. సినీ ప్రేమికుల కోసం రామోజీరావు ‘సితార’ పత్రిక ప్రారంభించారు. భాషా ప్రేమికుల కోసం ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలూ తీసుకొచ్చారు. ‘ప్రియా ఫుడ్స్‌’ పేరిట పచ్చళ్ల వ్యాపారాన్ని విజయవంతం చేశారు. 1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థ ఏర్పాటు చేసి, ఈ బ్యానర్‌లో అనేక చిత్రాలను నిర్మించారు.
ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ని రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామ పరిధిలో విస్తరించారు. 1990లో రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభించారు. ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో పలు ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించి, 2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ను ఏర్పాటు చేశారు. పేపర్‌, టీవీ మీడియాలోనే కాకుండా `డిజిటల్‌ మార్కెట్‌లోకి విస్తరించేందుకు ఈటీవీ భారత్‌ పేరిట మొబైల్‌ న్యూస్‌ యాప్‌ను తీసుకొచ్చారు. అనేక రంగాల్లో సేవలందించిన రామోజీ రావును పలు పురస్కారాలు వరించాయి. మీడియా రంగంలో ఇచ్చే అతి ప్రతిష్టాత్మకమైన బిడి గోయెంకా అవార్డు రామోజీరావుకు దక్కింది. 2016లో కేంద్రం ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్‌ అందుకున్నారు.

సంబంధితవార్తలు

అక్షరయోధుని అస్తమయం!

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

తెలుగు వెలుగు రామోజీ

Tags: పాడెమోసిన చంద్రబాబునాయుడురామోజీరావురామోజీరావు అంతిమ యాత్ర
Previous Post

సాయం అతడే..సమరం అతడే!!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2024

మరిన్ని వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్
ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్
ఆంధ్రప్రదేశ్

ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

చైతన్యరధం
@ September 28, 2026
జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర
ఆంధ్రప్రదేశ్

జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

చైతన్యరధం
@ September 26, 2026
వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీ మెయిన్ గ్రోత్ ఇంజన్ గా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీ మెయిన్ గ్రోత్ ఇంజన్ గా నిలవాలి

చైతన్యరధం
@ September 26, 2026
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist