అమరావతి (చైతన్యరథం): టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారం టూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరో పించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సోమవారం వర్ల రామయ్య లేఖ రాశారు. అనం తపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం శంఖారా వం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసుల విఫలం చెందారనిలేఖలో పేర్కొన్నారు. భద్ర తా ఏర్పాట్లు కల్పించాలని పోలీసులను ముందుగానే కోరినా కావాలనే విస్మరించారు. సభకు విచ్చేసిన అశేష ప్రజానీకం తోసుకోవడంతో లోకేష్ వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో ఒకరైన రాంబాబు గాయాలపాల య్యారు.
గతంలో లోకేష్ యువగళం పాదయాత్రకు సైతం సరైన భద్రతకల్పించలేదు.కళ్యాణదుర్గం, రాయ దుర్గం సభా ప్రాంగణాలకు సమీపంలో ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిం చింది. భద్రతా లోపాలకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు ఇచ్చినా పోలీసు అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడటంలేదు. ప్రతిపక్ష నాయకులకు భద్రత కల్పించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. త్వరలో సాధారణ ఎన్నికలు రాబోతున్న తరుణంలో నైనా తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.