అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాదులోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మరోవైపు ఎక్స్ వేదికగా ప్రజలకు లోకేష్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. మహోన్నతమైన ప్రజా స్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనదని లోకేశ్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కు లను మన రాజ్యాంగం ప్రసాదించిందని చెప్పారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.