- జగన్ కుట్రలో భాగంగానే గంటా రాజీనామా ఆమోదం
- జగన్ కుట్రలో భాగంగానే గంటా రాజీనామా ఆమోదించిన స్పీకర్
- ఆసరా పేరుతో జగన్ అబద్ధాలు, అసత్యాలు
- డబ్బు పిచ్చితో కల్తీ మద్యం అమ్ముతూ తాళిబొట్లు తెంపేవాడిని..
- సొంత తల్లి, చెల్లిని మెడపట్టి గెంటిన వాడిని అక్కచెల్లెమ్మలు నమ్ముతారా?
- పింఛన్ల చెల్లింపు, ఇళ్లపట్టాలు, ఇంటినిర్మాణం, ఆసరా, అమ్మఒడి సహా అన్నింట్లోనూ మహిళలకు మోసమే
- చంద్రబాబు కోటిమంది డ్వాక్రామహిళలకు ఒక్కొక్కరికీ రూ.20వేలు ఇచ్చారు
- జగన్‌రెడ్డి ఇప్పటివరకు రూ.15వేలు మాత్రమే ఇచ్చాడు
- టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఆర్థికసాయంలోనూ, లబ్ధిదారుల సంఖ్యలోనూ జగన్ కోత పెట్టాడు
అమరావతి: ఇటీవల ఉరవకొండ బహిరంగసభలో జగన్‌రెడ్డి యథాప్రకారం తన అబద్ధాల పరంపర కొన సాగించాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. ఒక పక్క ఆసరా పేరుతో మహిళలకు టోకరా వేస్తూ మరోపక్క అనర్ఘ ళంగా సత్యాలు చెప్పాడని, కల్తీమద్యం అమ్మిస్తూ మహి ళల మాంగల్యాలు తెంపుతున్న ముఖ్యమంత్రి ఏ రకం గా మహిళలకు అండగా నిలుస్తున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి విలేకరులతో మాట్లా డుతూ జగన్‌రెడ్డి ఆదేశాలతోనే స్పీకర్ ఇప్పుడు హడా వుడిగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనా మా ఆమోదించాడని తప్పుబట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసి మూడేళ్లు అవుతుంటే, ఇప్పుడు స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించడమేంటి? ఇన్నేళ్లు ఆయన నిద్రపోయాడా? పార్లమెంటరీ సాంప్రదాయాల కు విరుద్ధంగా గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిం చారు. స్పీకర్ ప్రవర్తన ఎప్పుడూ వింతగానే ఉంటుంది. రాజ్యజభ ఎన్నికల భయంతో కుట్రపూరితంగా జగన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీ నామాను స్పీకర్ ఆమోదించాడు. వచ్చే ఎన్నికల్లో ఆముదాలవలస ప్రజలు స్పీకర్ చీటీ చింపడానికి సిద్ధంగా ఉన్నారు. స్పీకర్ ఇష్టానుసారం వ్యక్తిగత నిర్ణ యాలు తీసుకుంటానంటే చూస్తూ ఊరుకోం. ఎవరైనా పార్లమెంట్ ప్రాక్టీసెస్‌కు అనుగుణంగానే వ్యవహరిం చాలి. గంటా రాజీనామా ఆమోదం సహా, వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని రవికుమార్ స్పష్టం చేశారు.
జగన్‌కు తగిన బుద్ధి చెబుతారు
2014-19 మధ్యకాలంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని కోటి మంది డ్వాక్రా మహిళలకు ఒక్కొ క్కరికి రూ.20 వేలు చొప్పున అందించారు. 2019 నుంచి నేటివరకు జగన్‌రెడ్డి పాలనలో ఒక్కో డ్వాక్రా మహిళ పొందిన లబ్ధి కేవలం రూ.15 వేలు మాత్రమే. ఆర్థికసాయం అందించడంలోనే కాకుండా డ్వాక్రా మహిళల సంఖ్యలో కూడా జగన్‌రెడ్డి కోతపెట్టాడు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డ్వాక్రా మహిళల సంఖ్య కోటి 14లక్షల మంది అయితే, ఆసరా పేరుతో 79లక్షల మందికే అరకొరసాయం అందించడం ఎలాంటి చేయూతో జగన్‌రెడ్డి చెప్పాలి. అబద్ధాలనే నమ్ముకున్న జగన్ రెడ్డికి వలువలు విప్పి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూన అన్నారు.
సున్నావడ్డీకి మంగళం పాడాడు..
డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీకే రుణాలు ఇస్తానన్న హామీని కూడా జగన్‌రెడ్డి విస్మరించాడు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చే సున్నావడ్డీతో సరిపెట్టి,ఏపీ ప్రభుత్వం నుంచి పైసా కూడా సాయం అందించకుండా సున్నావడ్డీ రుణాల హామీకి మంగళం పాడాడు. జగన్‌రెడ్డి ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.13లక్షల కోట్లు.. ప్రభుత్వా నికి వస్తున్న ఆదాయం రూ.10లక్షల కోట్లు. మొత్తం రూ.23లక్షల కోట్లలో జగన్‌రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో మహిళలకు ఇచ్చిన సొమ్మెంత? వారికి ఇస్తుంది గోరం త అయితే.. వారి నుంచి దోచేస్తున్నది కొండంత. ఇదే నిజమని కూన స్పష్టం చేశారు.
ఆడబిడ్డలపై దారుణాలకు తెగబడిన దుర్మార్గులపై చర్యలేవీ?
ఆడబిడ్డలకు తాను అండగా ఉన్నానంటున్న జగన్ రెడ్డి మాటలు పచ్చిఅబద్ధాలు. గత ఐదేళ్లగా మహిళలపై జరిగిన అత్యాచారాలు, నేరాలపౖౖె ఆయనేం సమాధానం చెబుతాడు? తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే నిందితుల్ని జగన్‌రెడ్డి శిక్షించాడా? సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే దళితమహిళ దారుణంగా హత్యాచారాని కి గురైతే ముఖ్యమంత్రి ఆమె కుటుంబానికి న్యాయం చేశాడా? దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుల్ని శిక్షించా డా? ఇదేనా ఆడబిడ్డలకు అండగా ఉండటమంటే?
తల్లిని, చెల్లిని గెంటేసి,సొంతపిన్ని తాళిబొట్టు తెంచి న వ్యక్తిని ఆడబిడ్డలునమ్ముతారా? కల్తీమద్యాన్ని మూడు రెట్లు అధిక ధరకు అమ్ముతున్న జగన్‌రెడ్డి, పేదల కష్టా ర్జితాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాడు. నాసిరకం మ ద్యాన్ని అమ్మి,పేదల ప్రాణాలతో వ్యాపారం చేస్తూ, ఆడ బిడ్డల తాళిబొట్లు తెంచుతున్నాడు. జగన్‌రెడ్డి అమ్మిస్తు న్న నాసిరకం మద్యంతాగి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సొంత పిన్ని తాళి తెంచిన జగన్‌రెడ్డి, రాష్ట్రంలోని మహిళల్ని రక్షిస్తానంటే నమ్ము తారా? ఆస్తిలో సమానహక్కు ఇవ్వాల్సిన సొంతచెల్లిని మెడపట్టి బయటకు గెంటిన జగన్‌రెడ్డా… ఆడబిడ్డల్ని రక్షించేది? తల్లిని ఇంటినుంచి గెంటేసిన జగన్‌రెడ్డి రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటాడా? ఈ ప్రశ్న లకు ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి నిజంగా మనిషైతే, ఆయనలో ఏ మాత్రం మానవత్వమున్నా తన చెల్లి, తల్లి, పిన్ని విషయంలో తాను వ్యవహరించిన తీరుపై నోరు విప్పాల్సిందేనని కూన డిమాండ్ చేశారు.
రూ.23 లక్షల కోట్లలో పేదలకు ఇచ్చింది కేవలం రూ.2.48లక్షల కోట్లే
జగన్‌రెడ్డి దోపిడీకి అంతేలేదు. నాడు-నేడు, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన ఇలా పథకం ఏదైనా అన్నింట్లో దోపిడీనే. ఇసుక, మద్యం, ఖనిజ సంపద, ప్రకృతి సంపద దోపిడీ మరో ఎత్తు. ఈ దోపిడీలు చాలవన్నట్లు నిత్యావసరాల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని దోచేస్తున్నాడు. ఉచితంగా పేదలకు ఇళ్లు ఇస్తానని మాటతప్పి, ఓటీఎస్ పేరుతో ఒక్కో ఇంటి నుంచి రూ.10వేల నుంచి రూ.30వేల వరకు లాక్కున్నాడు. జగన్ రెడ్డి ఇచ్చిన ఓటీఎస్ కాగితాలు చివరకు దేనికీ పనికి రాకుండా పోయాయి. సెంటు పట్టాలు, ఇళ్ల నిర్మాణం పేరుతో మహిళల్ని అప్పుల పాలు చేశాడు. చంద్రబాబునాయుడు పేదల సొంతింటి కలను నెరవేర్చ డం కోసం అత్యాధునిక హంగులతో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పాడు పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న రూ.1.50 లక్షల సొమ్ము తప్ప, జగన్‌రెడ్డి ఏ పేద కుటుంబానికైనా రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఇస్తున్నాడా? అప్పులు చేసిన సొమ్ము… రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం అంతా ఎటు పోతోంది? ఆదాయం, అప్పులు కలిపి వచ్చిన మొత్తం రూ.23లక్షల కోట్ల సొమ్ములో జగన్‌రెడ్డి బటన్ నొక్కుడు ద్వారా ఇప్పటివరకు పేదలకు ఇచ్చింది రూ.2.48లక్షల కోట్లు అయితే, మిగిలిన సొమ్మంతా ఎటుపోయింది? జగన్‌రెడ్డి ఆ సొమ్ముని బెంగుళూరు ప్యాలెస్‌కు చేర్చాడా..లేక ఇడుపుల పాయకు చేర్చాడా? అంగన్‌వాడీ జీతాలు జూన్‌లో పెంచుతానని చెప్పడా నికి జగన్‌రెడ్డికి సిగ్గుందా? ఇంకా ఆయన్ని ముఖ్య మంత్రిగా కొనసాగించడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిసీ, ఇలా అబద్ధాలతో అంగన్ వాడీ సిబ్బందిని వంచిస్తున్నాడని కూన మండిపడ్డారు.
పింఛన్ల చెల్లింపులోనూ వంచనే…
సామాజిక పింఛన్ల చెల్లింపులో కూడా జగన్‌రెడ్డి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్ని మోసగించాడు. చంద్రబాబు రూ.200ల పింఛన్ ను రూ.2వేలకు పెంచితే, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రూ.3వేలు ఇస్తానని నాలుగున్నరేళ్ల తర్వాత చివరిదశలో ఈ నెల లో రూ.3వేలు ఇచ్చాడు. పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో కూడా కోతపెట్టాడు. విడతలవారీగా పింఛన్లు పెంచు తానని చెప్పి, ఐదేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.30వేలు ఎగ్గొట్టాడు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో 34 లక్షల మంది పింఛన్ పొందేవారుంటే, చంద్రబాబు 2018 నాటికి ఆ సంఖ్యను 56 లక్షలకు పెంచారు. జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో పెంచిన పింఛన్ లబ్ధిదారుల సంఖ్య కేవలం7 లక్షలు మాత్రమే. చంద్ర బాబు ఐదేళ్లలో 22 లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు, చర్మకారులు, డప్పుకళాకారులు, ఒంటరి మహి ళలు, హిజ్రాలకు కూడా చంద్రబాబు పింఛన్లు అందిం చారని కూన తెలిపారు.
సాక్షి మీడియా యజమాని భారతి రెడ్డి కూడా తన భార్య కాదంటాడా?
తనకు పేపర్ లేదు.. టీవీ లేదు అని చెప్పుకోవ డానికి జగన్‌రెడ్డికి సిగ్గుందా? సాక్షి పత్రిక నీది కాక పోతే, భారతిరెడ్డి కూడా నీ భార్య కాదా జగన్‌రెడ్డి? సాక్షి ఛానెల్ నీది కాకపోతే, ఆదే ఛానల్‌కు నీ భార్య భారతిరెడ్డి ఎలా యజమానిగా వ్యవహరిస్తున్నారు? మహిళల రక్షణ కోసం తీసుకొచ్చానని చెప్పుకున్న దిశా యాప్ ఏమైందో జగన్‌రెడ్డి చెప్పాలి. ఎన్‌సీఆర్‌బీ నివే దిక ప్రకారం 2022లో రాష్ట్రంలో మహిళలపై 25,503 అఘాయిత్యాలు జరిగాయి. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న మంత్రి రోజా ఏం చెబుతుంది? తాను చెప్పిన గన్ ఎక్కడుందో, ఏ తలుపులో దూరిందో ఆమె నోరు విప్పాలి. జాతీయస్థాయిలో మహిళలపై జరుగు తున్న నేరాల రేటు 64.4శాతం ఉంటే, ఏపీలో ఆ రేటు 99.2శాతం ఉండటం జగన్‌రెడ్డి ఘనత కాదా? మహిళా భద్రతలో జగన్‌రెడ్డి డొల్లతనం ఎలాంటిదో చెప్పడానికి ఈ వివరాలే నిదర్శనం. ఈ లెక్కలన్నీ పార్ల మెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖే బయట పెట్టింది. దేశ వ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడోవంతు ఏపీలోనే జరుగుతున్నట్టు తేల్చింది. మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో జగన్‌రెడ్డి హయాంలో 30వేల మంది చిన్నారులు, మహిళలు అదృశ్యం అయ్యారు. వారంతా ఏమైపోయారో.. ఎక్క డున్నారో హోంమంత్రి తానేటి వనిత సమాధానం చెప్పాలి. మహిళల్ని ఉద్ధరించాను అంటున్న జగన్ రెడ్డి మాటలు పచ్చి అబద్ధాలు అనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని కూన ప్రశ్నించారు.