చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో

రెడ్‌బుక్‌ పేరెత్తితే ఉలికిపాటేందుకు

by చైతన్యరధం
Dec 30, 2023 at 8:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీసీల కోసం  ప్రత్యేక మ్యానిఫెస్టో
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 4 నుంచి జయహో బీసీ కార్యక్రమం
  • తెలుగుదేశం బీసీల పుట్టినిల్లు… న్యాయం చేసింది మేమే
  • టీడీపీ-జనసేన మధ్య అద్భుత సమన్వయం ఉంది
  • ‘వ్యూహాని’కి ప్రతివ్యూహం ఉండొద్దా
  • వ్యూహం సినిమా నిర్మాత  సీఎం జగన్మోహన్‌ రెడ్డే
  • నేను సజ్జల, రఘురామిరెడ్డి ఇచ్చిన  స్క్రిప్ట్‌ చదవాలా?
  • రెడ్‌బుక్‌ పేరెత్తితే ఉలికిపాటేందుకు
  • విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

అమరావతి: రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమ స్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభిం చాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. మంగళ గిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లోకేష్‌ మాట్లాడుతూ…జయహో బీసీ కార్యక్రమ నిర్వ హణపై తొలుత పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్‌ షాపు ఏర్పాటు చేసుకుంటామ న్నారు. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ, మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వా త రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బీసీ సోదరులకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాం. యువగళం పాదయాత్రలో బీసీ సోద రులు పడుతున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నాను, నేను తిరగని మండలాల్లో కూడా జయహో బీసీ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుందని లోకేష్‌ చెప్పారు.

బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం

సంబంధితవార్తలు

ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు

పెద్దిరెడ్డికి షాక్‌!

సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌తో షాక్‌లో వైసీపీ నేతలు

బీసీి సోదరులకు పుట్టినిల్లు టీడీపీ. రాజకీయంగా ఆనాడు అన్న ఎన్టీఆర్‌ 1983లో బీసీ సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి కీలకశాఖలు ఇచ్చి గౌరవించారు. బీసీ అంటే బలహీనవర్గం కాదు, బలమైన వర్గం. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్‌ 24 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే, చంద్రబాబునాయుడు 34శాతానికి పెంచారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36 వేల కోట్లు ఖర్చుచేశాం. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ. 3 వేల కోట్లు, ఆదరణ ద్వారా వెయ్యికోట్లు వెచ్చించాం. బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌, విదేశీవిద్య, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వంటి ఎన్నో పథకాలు అమలుచేశాం. చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులకు 50ఏళ్లకే పెన్షన్‌ ఇచ్చాం. శాసనసభలో తీర్మానం చేసి బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరాం. 2019లో టీడీపీ ఓడినా బీసీల కోసం సాధికార కమిటీలు ఏర్పాటుచేసి, వారి గళాన్ని విన్పించేందుకు వేదిక ఏర్పాటుచేశామని లోకేష్‌ తెలిపారు.

బీసీలను ఊచకోత కోసిన వైసీపీ!

బీసీ సోదరుల ద్రోహి జగన్‌. 2019లో వైసీపీ అధి కారంలోకి వచ్చాక అనేకమంది బీసీలను అత్యంత అమానవీయంగా చంపేశారు. అమర్‌నాథ్‌ గౌడ్‌ అనే బీసీ బాలుడు,తనఅక్కను ఎందుకువేధిస్తున్నారని వైసీపీ నాయకులను అడిగితే,ఆ బాలుడి పుస్తకం చించి కాగి తాలను నోటిలో కుక్కి, పెట్రోలు పోసి కాల్చేశారు. ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గానీ,వైసీపీ నేతలుగానీ కనీ సం పరామర్శించలేదు.అమర్నాథ్‌ గౌడ్‌ను హత్య చేసిన హంతకుడు బయట దర్జాగా తిరుగుతున్నాడు. నిందితు డ్ని వైసీపీ నాయకులు ఊరేగించి ఇంటికి తీసుకెళ్లారు. పొద్దుటూరులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోరాడినందు కు నందం సుబ్బయ్య అనే బీసీ నాయకుడిని దారుణం గా నరికిచంపారు. ఆయన శవాన్ని చూడటానికి కూడా జనం భయపడ్డారు. సుబ్బయ్య భార్య అపరాజిత ఇప్పు డు న్యాయపోరాటం చేస్తోంది. శ్రీకాళహస్తిలో ముని రాజమ్మ అనే మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లా డినందుకు ఎమ్మెల్యే ఆమె షాపును ధ్వంసం చేయించా రు.కాళ్లు పట్టుకుంటే వదిలేస్తామని బెదిరించారు.వైసీపీ పాలనలో కల్లుగీత కార్మికులు, స్వర్ణకారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేష్‌ అన్నారు.

బీసీల భూములు కూడా కొట్టేశారు!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీిల రిజర్వేషన్‌ను 10 శాతం తగ్గించారు. బీసీలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములు కొట్టేశారు. ఆదరణ పథకం కింద గతంలో లబ్ధిదారులు చెల్లించిన 10శాతం డిపాజిట్‌ కూడా ఇవ్వలేదు. 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు లేవు. బీసీి కార్పొరేషన్ల డైరక్టర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.జీఓ 217తో మత్స్యకారుల వెన్ను విరిచారు. చేనే తలు, పట్టురైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలేదు. బీసీి సోదరుల తరపున పోరాడుతున్న అనేకమంది బీసీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించారు. యన మల రామకృష్ణుడు పెళ్లికి వెళ్లితే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టా రు, అయ్యన్నపాత్రుడుపై రేప్‌ కేసు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు మోపారు.ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని లోకేష్‌ దుయ్యబట్టారు.

బీసీలు బ్యాక్‌ బోన్‌ అంటే.. వెన్నువిరవడమా?

మీడియా ప్రశ్నలకు లోకేష్‌ సమాధానమిస్తూ… ముఖ్యమంత్రి జగన్‌ బీసీిలు బ్యాక్‌ బోన్‌ అంటూనే వారి వెన్నువిరిచే కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్‌ తగ్గించారు. కార్పొరేషన్లకు నిధుల్లేకుండా చేశారు. ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముట్టు ఇవ్వలేదు, ఆదరణ పథకాన్ని మూలనబెట్టారు. వైసీపీ బీసీ ఎమ్మెల్యేలు తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని అంటున్నారు. జగన్‌ చెప్పే మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 26వేల మందిపై తప్పుడు కేసు లు పెట్టించారు, పలువుర్ని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపించారు, ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోం ది. జగన్‌ ప్రభుత్వ అరాచకాలపై బీసీ సోదరుల్లో చైత న్యం రావాల్సిన అవసరం ఉంది. శాసనసభ, శాసన మండలి, లోక్‌సభ, రాజ్యసభలో బీసీలకు అవకాశం ఇచ్చింది టీడీపీ. టీటీడీ, తుడా చైర్మన్‌ సహా అనేక పదవులు బీసీిలకు ఇచ్చాం. జగన్‌ హయాంలో ఇప్పుడు రెండుసార్లు టీటీడీ పదవి ఏ సామాజిక వర్గానికి ఇచ్చా రో అందరికీ తెలుసు. వాస్తవాలు చర్చించేందుకు మేం రెడీ, కొల్లు రవీంద్ర చాలెంజ్‌ చేస్తే వారు ఎందుకు రాలేదని లోకేష్‌ ప్రశ్నించారు.

బీసీలకోసం ప్రత్యేక రక్షణ చట్టం!

పాదయాత్రలో నేను అనేక హామీలు ఇచ్చాను. బీసీి సోదరులకు రక్షణకు ప్రత్యేక చట్టం, బీసీలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చాను, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా టెక్నా లజీతో అనుసంధానం చేసి యాప్‌ ద్వారా సర్టిఫికెట్‌ అందుబాటులోకి తెస్తాం. ఉపకులాల వారీగా నిధులు కేటాయించి, ఆ నిధులనువారి స్వయం ఉపాధి, సంక్షే మం కోసం ఖర్చుచేస్తాం, బీసీ సోదరులకు దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు కేటాయిస్తాం. విదేశీ విద్య, బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌ వంటివి పునరుద్ధరిస్తాం. స్థానిక సంస్థల్లో తగ్గించిన 10శాతం రిజర్వేషన్‌ మేము వచ్చాక తిరిగి కల్పిస్తాం. పాదయాత్రలో వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ప్రకారం ఇప్పటివరకు పలు హామీలు ఇచ్చాం, 2 నెలల పాటు నిర్వహించే జయహో బీసీి కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకొని, పూర్తిస్థాయిలో వారికి భరోసా ఇస్తామని లోకేష్‌ చెప్పారు.

చిత్తశుద్ధి ఉంటే గెలిచే సీట్లు ఇవ్వాలి

జగన్మోహన్‌రెడ్డి ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇస్తు న్నారు, గెలిచేసీట్లు సొంత సామాజికవర్గీయులకు ఇచ్చు కుంటున్నారు. మంగళగిరిలో రెండుసార్లు ఆర్కే గెలిచా రు, ఇప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా అడ్డం తిరిగే సరికి బీసీి పేరుతో మ్యాజిక్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారికి నైతికహక్కు ఎక్కడుంది?నాడు-నేడు ఎల్లప్పుడూ బీసీి సోదరులకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే. చట్ట సభల్లో ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశంపార్టీ. కౌన్సి ల్‌, నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రాధాన్యతని స్తాం.మంత్రి విడదల రజనిని గుంటూరు వెస్ట్‌కి మార్చా రు. గతఎన్నికల్లో వేవ్‌లో కూడా అక్కడ వైసీపీ గెలవ లేదు, నిజంగా జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సొంత బంధు వును కాదని కడప పార్లమెంటు టిక్కెట్‌ ఇవ్వమనండి. పులివెందుల సీటు బీసీిలకు ఇవ్వమనండి. ఓడిపోయే సీట్లుఇస్తే ఆయనను ఎవరు నమ్ముతారు. గతంలో గెలి చిన చిలకలూరిపేట టిక్కెట కాదని, రజనిని ఇప్పుడు వెస్ట్‌కు ఎందుకుమార్చారని లోకేష్‌ ప్రశ్నించారు.

బస్సు యాత్రలతో ఉపయోగమేంటి?

పాదయాత్రలో బీసీసోదరులకు పలుహామీలు ఇచ్చాను. వాటికి కట్టుబడిఉన్నాం. మత్స్యకారులకు గొడ్డలిపోటుగా ఉన్న 217జీఓ మొదటివందరోజుల్లో రద్దు చేస్తామని చెప్పా.ఉపకులాలవారీగా ఎదుర్కొంటున్న సమస్యలు,వాటి ని ఎలా పరిష్కరిస్తామో చెప్పాము, బీసీల గళాన్ని విన్పిం చేందుకు 54సాధికార కమిటీలు గతంలోనే వేశాం. ఉప కులాల వారీగా నాయకత్వాన్ని ప్రోత్సహించాం, ఆకమిటీ లు కూడా కొన్ని వివరాలు సేకరించాయి, వాటిని మ్యాని ఫెస్టోలో పెడతాం. వైసీపీ హయాంలో ఒక్క బీసీి సోదరు డికి లోన్‌ ఇచ్చానని నిరూపించమనండి. లోన్లు ఇవ్వరు, పనిముట్లు ఇవ్వరు, తరతరాలుగా మత్స్యకారుల చేతిలో ఉన్న చెరువులు పెత్తందారులకు ఇస్తారు. ఎప్పుడులేని విధంగా దళితులపై దాడులు జరుగుతుంటే సీఎం ఒక్క సారైనా నోరు విప్పారా? డాక్టర్‌ సుధాకర్‌,డాక్టర్‌ అచ్చెన్న, ఓం ప్రతాప్‌, అనితారాణిపై దాడి చేస్తుంటే ఏంచేశారు? హోంమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత యువకు డ్ని చంపుతుంటే ఏమి చేయలేకపోయారు. ఇలాంటి పరి స్థితుల్లో సామాజిక బస్సుయాత్రల వల్ల ఉపయోగం ఏమిటని లోకేష్‌ నిలదీశారు.

బటన్‌ ఏమైనా జగన్‌ కనిపెట్టాడా?

ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌పై తనకే పేటెంట్‌ ఉన్న ట్లుగా బిల్డప్‌ ఇస్తున్నాడు. బటన్‌ ఏమైనా జగన్‌ కని పెట్టాడా? 2009లో టీడీపీ మ్యానిఫెస్టోలో డీబీటీ ఉంది,2014లో కొన్ని పథకాల్లో ఈవిధానాన్ని అమలు చేశాం. బీసీి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చాం. జగన్మోహన్‌రెడ్డి రొటీన్‌గా ఇచ్చే పెన్షన్లు, అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ ప్రచారం చేసుకుంటు న్నారు. వైసీపీ వచ్చాక బీసీలకు ఒక్క లోన్‌ ఇవ్వలేదు. దళితుల కు మేం అమలుచేసిన 27సంక్షేమ పథకాలు రద్దుచేశా రు.రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం పూర్తిచేయలేదు, మేం 80శాతం పూర్తిచేసిన వాటిని కూడా, మిగిలిన 20శాతం చేయలేకపోయారని లోకేష్‌ విమర్శించారు.

సజ్జల, రఘురామిరెడ్డి స్క్రిప్ట్‌ చదవాలా?

ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో వారిపై జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి,డిస్మిస్‌ చేస్తామని నేనుబహి రంగసభలో చెప్పాను. ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు. నేను ఏంమాట్లాడాలో సీఐడీ వాళ్లు నాకు చెబుతారా? ఒక పనిచేయమనండి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపీఎస్‌ అధికా రులు రఘురామిరెడ్డి, సీతారామాం జనేయులు స్క్రిప్ట్‌ పం పించమనండి,అదేచదువుతాను.ప్రజాస్వామ్యంలో మాఅభి ప్రాయాన్ని చెప్పే హక్కులేదా? ఏఅధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించారో అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసు కుంటామని చెప్పాను,ఆ మాటలకు కట్టుబడి ఉన్నా. ఆ మాటలకే రఘురామిరెడ్డి,సీతారామాంజనేయులు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు ఇస్తారా? సీిఐడీ విచారణ సంద ర్భంగా రెండురోజులు నన్ను అడిగిన ప్రతిప్రశ్నకు సమా ధాన మిచ్చా. నేను ఎర్రబుక్కు పేరుచెబితే వారు ఉలిక్కి పడుతున్నారు, ఎర్రబుక్కులో ఎవరిపేర్లు ఉన్నాయో వారికె లా తెలుసు? చట్టాన్ని ఉల్లంఘించామని రఘురామిరెడ్డి, సీతారాంజనేయులు ఒప్పుకుంటున్నారా?చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి ఇప్పుడు భయపడుతున్నారు. వారి పేర్లు రెడ్‌ బుక్‌లో పెట్టానని నేను ఎక్కడా చెప్పలేదు. తప్పుచేసిన వారే నా మాటలకు భయపడాలి. వారు తప్పుచేశారో, లేదో వారే తేల్చుకోవాలని లోకేష్‌ అన్నారు.

జగన్‌ ప్రోద్భలంతోనే వ్యూహం సినిమా

వూహం సినిమాపై ప్రతివ్యూహం ఉండొద్దా.ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం, సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారింది. వ్యూహం సినిమా బడ్జెట్‌ అంతా సైకో జగన్‌ దే. ఇప్పటికే ఆ సినిమా డైరక్టర్‌ రెండుమూడుసార్లు జగన్‌ను కలిశారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తరపున న్యాయపోరాటం చేస్తున్న లాయర్‌ వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన తెలంగాణా హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? దీని వెనుక ప్రభుత్వం ఉంది. సినిమా తీయాలంటే హు కిల్డ్‌ బాబాయ్‌, కోడి కత్తి, ప్యాలెస్‌ కుట్రలపై తీయవచ్చు. లేనిది ఉన్నట్టు చూపితే మేం పోరాడతాం.మాకుఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్య త కోర్టులపై ఉంది.  స్టేట్‌, సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డులకు లేఖలు రాశాం పట్టించుకోలేదు, అందుకే కోర్టుకెళ్లాం, న్యాయస్థానంలో వచ్చే తీర్పును బట్టి ముందుకు వెళ్తాం.

చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా?

మన ఇంట్లో చెత్త పక్క ఇంటి ఎదుట వేస్తే బంగా రం అవుతుందా? ఒక చోట పనికిరాని అభ్యర్థి మరో చోట ఎలా పనికివస్తారు. చిలకలూరిపేటలో చెత్త అని తేల్చిన వ్యక్తిని గుంటూరు వెస్ట్‌లో వేస్తే బంగారం అవు తుందా? ప్రజలు ఈ విషయన్ని గమనించరా? అద్భుత మైన అభ్యర్థి అయతే అక్కడే పెట్టాలి కదా? చెత్త ఎక్కడై నా చెత్తచెత్తే. మంగళగిరిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కార్పొరేషన్‌ ఎన్నికలు జరపలేదు. ఈ పార్టీ ఇక ఉండదని ఎమ్మెల్యే ఆర్కే వదిలేశారు. ఇప్పుడు జనం ఇబ్బంది పడుతున్నారు. మరో 3నెలల్లో ఈ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయం,మంగళగిరిని నేను పూర్తిస్థాయిలో అభివృద్ధిచేస్తానని లోకేష్‌ హామీఇచ్చారు.

జనసేనతో అద్భుత సమన్వయం ఉంది

జనసేన పార్టీతో మాకు అద్భుతమైన సమన్వయం ఉంది, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్య క్రమాల్లో మావారితో జనసైనికులు కలిసి తిరుగుతున్నా రు, లేదని మీరు ఎలా చెబుతారు? సంక్రాంతి పండుగ తర్వాత మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. ఎన్నికల షెడ్యూ లు ఎనౌన్స్‌ చేశాక అభ్యర్థులను ఎంపిక చేస్తాం, అంత ర్గతంగా చాలామందికి నియోజకవర్గాల్లో పనిచేసుకో మనిపార్టీ అధ్యక్షుడుచెప్పారు, సరైన సమయంలో అభ్య ర్థులను అధ్యక్షుడు ప్రకటిస్తారు. రాష్ట్రంలో అనేకమంది ఉద్యోగులు తమ డిమాండ్లపై రోడ్డెక్కుతున్నారు. అంగన్‌ వాడీ, విద్యుత్‌, ఎస్‌ఎస్‌ఎ, ఆరోగ్య శ్రీ ఉద్యోగులు… ఇలా ప్రతిఒక్కరూ రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వం దివాలాతీసింది,డబ్బుల్లేవు,ఉద్యోగుల న్యాయ మైన డిమాండ్లను మా ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తాం. గతంలో చెప్పకపోయినా అంగన్‌వాడీల జీతాలు పెం చాం,అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలను ఆదుకుం టామని స్వయంగా హామీ ఇచ్చామని లోకేష్‌ అన్నారు.

Tags: ‘వ్యూహాంజనసేనజయహో బీసీ కార్యక్రమంటీడీపీటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిప్రత్యేక మ్యానిఫెస్టోబీసీలురఘురామిరెడ్డిరెడ్‌బుక్‌లోకేష్‌సజ్జలసీఎం జగన్మోహన్‌రెడ్డిస్క్రిప్ట్‌
Previous Post

రాజకీయాలకు అనర్హుడు జగన్‌

Next Post

చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

కార్యకర్త
@ July 3, 2025
ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌
ఆంధ్రప్రదేశ్

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు

చైతన్యరధం
@ July 3, 2025
గడపగడపలో సీఎం
ఆంధ్రప్రదేశ్

గడపగడపలో సీఎం

చైతన్యరధం
@ July 3, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025

కార్యకర్త
@ July 2, 2025
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist