• వినుకొండ నియోజకవర్గం అంగలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 2వేల మంది జనాభా నివసిస్తున్నారు.
• 80శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
• గ్రామం పరిధిలో అగ్రహారాల క్రింద 1,254 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
• మా భూములకు ప్రతియేటా పన్నులు చెల్లిస్తున్నాం.
• ఈనాం భూములు కావడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా భూములకు సమగ్ర సర్వే చేయించాలి.
• నిషేధిత జాబితా నుండి మా భూములను తొలగించి పట్టాలు ఇప్పించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ఈనాం భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సమస్య ఉంది.
• అధికారంలోకి వచ్చాక సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ అనుభవదారులను గుర్తిస్తాం.
• దీర్ఘకాలంగా భూములను సాగుచేసుకుంటున్న వారికి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో చర్చిస్తాం.
• నిబంధనలకు లోబడి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.