కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గురువారం దగదర్తి మండలం, కొత్తపల్లి కౌరుగుంట గ్రామ పర్యటించారు. గ్రామంలోని హరిజనవాడలో త్రాగునీటికి ఉపయోగించు బావి మురుగునీరు ఉండడం వలన నీటిని ఉపయోగించేందుకు వీలు లేదన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. బావిని పునరుద్ధరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, నగళ్ళ సుధాకర్, ఎందేటి తిరుపతి, అంబటి రమేష్, విడవలూరు మల్లికార్జున్, వల్లెపు మల్లికార్జున, హరిప్రసాద్, ఆనంద్ పాల్ తదితరులు ఉన్నారు.