యువగళం పాదయాత్ర మరో మైలు రాయి చేరుకుంది. యువగళం పాదయాత్ర 800 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో హామీ ఇచ్చారు. సింగనమల నియోజకవర్గం, గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద తాను ఇచ్చిన హామీకి గుర్తుగా లోకేష్ ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
జన చైతన్యమే యువగళం ధ్యేయం. సమస్యల పరిష్కారానికి మార్గం. పాదయాత్ర 800 కి.మీ. మైలురాయికి చేరిన సందర్భంగా సింగనమల నియోజకవర్గం, గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించుకున్నాను అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.