ఉన్నమాట అంటే ఉలుకెందుకు పుట్టపర్తి ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధర్ రెడ్డి గారూ! దొంగలని దొంగా అన్నామని పుట్టపర్తిలో టిడిపి శ్రేణులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పై దాడులకి దిగారు వైసిపి గూండాలు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఎమ్మెల్యే దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి అవినీతి చేశారని పల్లె రఘునాథరెడ్డి ప్రమాణం చేశారు. నీతిమంతుడైతే వైసిపి ఎమ్మెల్యే ప్రమాణం చేయొచ్చు! పోలీసుల్ని ప్రయోగించి, వైసిపి గూండాలతో దాడులకి పాల్పడ్డారంటే అవినీతి చేశామని ఒప్పుకున్నట్టే. నీ రౌడీలకి టిడిపి భయపడదు, వెనక్కి తగ్గదు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.