కన్నతండ్రిని రాజకీయ ఆధిపత్యం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనుషులు కడతేర్చారు. ఏ పాపం తెలియని చిన్నారులకు రాజకీయాలే శాపమయ్యారు. ఈ కష్టకాలంలో ఆ చిన్నారులని అక్కున చేర్చుకుని తెలుగుదేశం గుడి అయ్యింది. చిన్నారుల భవిత బాధ్యతలు తీసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ బడిగా నిలిచింది.
కురుబవాండ్లపల్లికి చెందిన టిడిపి కార్యకర్త మదన్ మోహన్ ని, 2004లో అప్పటి కాంగ్రెస్ నాయకులు దారుణంగా హత్య చేశారు. కంటికి రెప్పలా కాచే తండ్రి దూరం కావడంతో పిల్లలు సాయిచరణ్, మోహన్ భవిష్యత్తు అగమ్యగోచరమైంది. తెలుగుదేశం పార్టీ ఇంటికి పెద్దలా పిల్లల బాధ్యతలు స్వీకరించింది. సాయి చరణ్ ఎన్టీఆర్ స్కూల్ లో ఇంటర్ వరకూఉచితంగా విద్య,వసతి కల్పించి చదివించారు. బీటెక్ పూర్తి చేయడానికి కూడా టిడిపి సహకారం అందించింది.
ఇప్పుడు మోహన్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. చిన్నఅబ్బాయి మోహన్ ఎన్టీఆర్ స్కూల్‌లోనే ఇంటర్ పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. తమని తల్లిదండ్రుల్లా పెంచి పెద్దచేసి, చదివించిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని చెబుతున్న ఈ అన్నదమ్ములు, పాదయాత్రలో నారా లోకేష్‌ని కలిపి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయ ప్రత్యర్థులు ఆధిపత్యం కోసం విధ్వంసం, హత్యలనే నమ్ముకున్నారు.
తెలుగుదేశం విద్యావికాసానికి కృషి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి మానవత్వ విలువలు పెంపొందించడం వంటి నిర్మాణాత్మక వైఖరితో దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉంది. మొక్కని కొట్టడం ఒక్క నిమిషం పని. ఇదే పని నాడు వైఎస్, నేడు ఆయన తనయుడి నైజం. మొక్కలు నాటి, చెట్లుగా ఎదిగేలా కృషిచేసి, వాటి ఫలాలు జనాలు పొందేలా చేయడం తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ పాటిస్తున్న విలువలు. దీనికి నిదర్శనం వేలమంది సాయిచరణ్, మోహన్ లు ప్రతీచోటా మనకి విద్యవిజ్ఞానంతో ప్రయోజకులైన విజేతలుగా మనల్ని పలకరిస్తూనే ఉంటారు. తెలుగుదేశం దార్శనికత, దాతృత్వం, గొప్పతనాన్ని చాటిచెబుతూనే ఉంటారు.