అమరావతి : ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మరోమారు విషం కక్కారు. పరిపాలన వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ పేరుతో దాదాపు మూడుగంటలపాటు ముఖ్యమంత్రి, మంత్రులు సాగదీస్తూ అమరావతిపై బురదజల్లే ప్రయ త్నం చేశారు. అయితే టిడిపి శాసనసభాపక్ష నేత నిమ్మల రామానాయుడు, పిఎసి చైర్మన్ పయ్యా వుల కేశవ్‌లు అమరావతిపై ఆరోపణలకు దీటుగా సమాధానమిస్తూ అధికారపక్షానికి చుక్కలు చూపించారు. చివ రగా ముఖ్యమంత్రి జగన్ సుమారు గంటకు పైగా సమయాన్ని ప్రజారాజధాని అమరావతిని బద్నాం చేయడానికి,ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, జగన్ రెడ్డి అడ్డగోలు విధానాలపై పదేపదే ప్రశ్నిస్తున్న ఈనాడు, ఎబిఎన్, టివి 5లపై బురద జల్లడానికే అధిక సమయం తీసుకున్నారు. పసలేని వాదనతో ముఖ్య మంత్రి జగన్‌చేసిన సుదీర్ఘ ప్రసంగంలో అమరావతిపై చేసిన ప్రతి ఆరోపణకు తెలుగుదేశంపార్టీ సమాధాన మిస్తుంది. అయితే ఇది జగన్‌రెడ్డి కోసమో, వైసిపి మూకలకోసమో కాదు..5 కోట్ల ఆంధ్రులకు వాస్తవమేమిటో తెలియజెప్పేందుకు మాత్రమే.
ఆరోపణ 1: అమరావతిలో అన్నీ గ్రాఫిక్సే
వాస్తవం: రాజధాని గురించి ముఖ్యమంత్రి ప్రసంగించిన అసెంబ్లీ, పక్కనే పరిపాలిస్తున్న సచివాలయం, నీ అవినీతి కేసులు విచారిస్తున్న హైకోర్టు,మీ బినామీలకు భూములు కేటాయించే ఏపీఐఐసీ భవనం, అక్రమ కేసులు పెట్టించే డీజీపీ కార్యాలయం.. అన్నీ గ్రాఫిక్సేనా!
ఆరోపణ 2: టీడీపీ హయాంలో రాజధానిపై ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే.
వాస్తవం: 2015 అక్టోబర్ 22న రాజధాని పనులు శంకుస్థాపన చేసి 4ఏళ్లలో రూ.9,165కోట్లు రాజ ధాని నిర్మాణానికి వ్యయం చేయడం జరిగింది.
ఆరోపణ 3: ఎకరా రూ.20 కోట్ల చొప్పున 5,020 ఎకరాలు అమ్మి లక్షకోట్లతో రాజధాని కడతారం ట! ఎకరా రూ.20 కోట్లకు ఎవరైనా కొంటారా?
వాస్తవం: అనంతవరం, మందడం, ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామ పరిధిలో రైతులిచ్చిన భూమిలో 480 ఎకరాలను ఎకరా రూ.17.74 కోట్ల చొప్పున బ్యాంకుల్లో తనఖా పెట్టి హడ్కో రుణం కోసం దరఖాస్తు చేసిం ది మీరు కాదా? అమరావతి భూములు విలువై నవి కాకపోతే బ్యాంకులకు ఎకరా రూ.17కోట్లని ఎలా చెప్పారు?
ఆరోపణ 4: 5 ఏళ్లలో కనకదుర్గమ్మ ఫ్లై వోవర్ పూర్తి చేయలేదు.
వాస్తవం: వైయస్ హయాంలో అసాధ్యమన్న కనక దుర్గమ్మ ఫ్లైవోవర్‌ను టీడీపీ మొదలుపెట్టి 85% మేర పనులు పూర్తి చేయడం జరిగింద. మిగిలిన మొత్తానికి నిధులు కూడా మంజూరు చేయడ మైంది. (అనుబంధం-2)
ఆరోపణ 5: రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టే స్థోమత మనకుందా? ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.30 లక్షల కోట్లు కావాలి.
వాస్తవం: రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం రాబోయే 15 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసేది కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే. అభివృద్ధికి అవసరమైన మిగిలిన నిధులు వివిధ ఏజెన్సీలు దశలవారీగా సమకూరుస్తాయి.
ఆరోపణ 6: రాజధానిలో కమర్షియల్ మోనిటైజేషన్ కు అందుబాటులో ఉన్న భూమి కేవలం 5,020 ఎకరాలు మాత్రమే.
వాస్తవం: రాజధానిలో ఎకనమిక్ సిటీ కోసం కేటా యించిన 3,254 వివిధ కేటాయించేందుకు ప్రత్యే క కేటగిరిలో చూపినవి. ఆ భూములతో కలిపితే 8,274 ఎకరాల భూమి కమర్షియల్ మానిటైజేష న్‌కు అందుబాటులో ఉంది.ముఖ్యమంత్రి చూపిన జిఓలోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. జిఓలు కేవలం ఒక అంశాన్ని మాత్రమే చదువుతూ ఎకన మిక్ సిటీ కోసం కేటాయించిన 3,254 ఎకరాలు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసమని చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శ నం. (మొత్తంగా అందుబాటులో ఉన్న 8,274 ఎకరాలను వైసిపి ప్రభుత్వం హడ్కోకు చెప్పిన ప్రకారం ఎకరా 17.74 కోట్లుగా గుణిస్తే
ఆరోపణ 7: అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నది అసలు రైతులు కాదు.. హైదరా బాద్, ఇతర ప్రాంతాల వారు, పెయిడ్ ఆర్టిస్టులు. (మంత్రులు అన్నమాటలు)
వాస్తవం: ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకుని అడ్రసు లు అన్నీ పరిశీలించి 600 మందికి ఐడీ కార్డులు ఇచ్చిన డీజీపీని అడిగితే వారంతా అసలో, నకిలీ నో ఆయనే మీకు సమాధానమిస్తారు.
ఆరోపణ 8: అమరావతిలో లేని వాటిని ఉన్నట్లు భ్రమ గొలిపి రైతులను మోసగించిన చంద్రబాబునాయు డి పై 420 కేసు పెట్టాలి.
వాస్తవం: సీపీయస్ రద్దు, మద్యనిషేధం, 45 ఏళ్లకే పెన్షన్..వంటి ఎన్నో అంశాలపై మాటతప్పి, మడ మ తిప్పిన జగన్‌రెడ్డిపై ఎన్ని 420కేసులు పెట్టా లి? చంద్రబాబునాయుడు మీలాంటి సైకోలు ఎన్ని ఇబ్బందులుపెట్టినా అమరావతివిషయంలో మాట పై నిలబడ్డారు. మీమాది ఎన్నికల ముందు ఒక మాట,ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడలేదు.
ఆరోపణ 9: పొరుగున ఉన్న విజయవాడలో కూడా చంద్రబాబునాయుడు అయిదేళ్లలో ఏమీచేయలేదు.
వాస్తవం: గత 5ఏళ్లలో విజయవాడకు దాదాపు రూ.6 వేల కోట్లు వ్యయం చేసి అభివృద్ధి చేశాం.
ఆరోపణ 10: టిడిపి గాలికొదిలేస్తే విజయవాడ ఈస్ట్ బైపాస్ రోడ్డు మేం అభివృద్ధి చేస్తున్నాం.
వాస్తవం: అమరావతి రింగు రోడ్డు కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 189 కి.మీ. కేంద్రం నుంచి అనుమతి తెస్తే, భూసేకరణ చేయలేక 78 కి.మీ.ల ఈస్ట్ బైపాస్ రోడ్డుకు కుదించుకోవడం మీ చేతకానితనం కాదా?
ఆరోపణ 11: పరిపాలనా వికేంద్రీకరణవల్ల గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం.
వాస్తవం: వరదలు సంభవించాక రెండు వారాలకు కేవలం 4 ఉల్లిపాయలు, 4 టమోటాలు ఇచ్చి మ మ్మల్ని గాలికొదిలేశారని గోదావరి జిల్లాల వరద బాధితులు మీడియా ముఖంగా చెప్పిన మాటలు మీకు గుర్తులేదా? లేక నటిస్తున్నారా?
ఆరోపణ 12: అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు.
వాస్తవం: సీయంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పను లు నిలిపివేయడం, 80%పైగా పూర్తయిన భవ నాల నిర్మాణాన్ని నిలిపేయడం, రైతులపై కేసులు పెట్టడం, రైతులు న్యాయం కోసం చేస్తున్న ఆందో ళనలు,యాత్రలపై పోలీసులతో ఉక్కుపాదం మోప డం కక్షపూరిత చర్యల్లో భాగం కాదా?
ఆరోపణ 13: అమరావతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల కోసం కాదు. పెత్తందారుల కోసమే.
వాస్తవం: ఎస్సీ నియోజకవర్గంలో నిర్మిస్తూ చుట్టుపక్క ల 9ఎస్సీ నియోజకవర్గాల మధ్య నిర్మిస్తున్న అమ రావతిలో 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. భూములిచ్చిన రైతుల్లో కూడా సింహ భాగం వారే.
ఆరోపణ 14: ఇక్కడ నుంచి ఉత్తరాంధ్రపోయి ఆ గుడుల్లో ఏమని మొక్కుతారు? ఉత్తరాంధ్ర ప్రజలు గమ్ముగా ఉండాలంట. భావోద్వేగాలను రెచ్చ గొట్ట డం ధర్మమేనా?
వాస్తవం: అమరావతి ఉద్యమంపై విషం చిమ్మటం మీకు కొత్తేమీ కాదు. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతులు తిరుపతికి పాదయాత్ర చేపట్టినప్పుడు ఇలాగే రెచ్చగొట్టారు.కొన్నిచోట్ల మీ రౌడీమూకలతో దాడులు చేయించారు. కానీ ప్రజ లు అమరావతి రైతులకు బ్రహ్మరథం పట్టారు. చైతన్యవంతులైన ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గతం కంటే మిన్నగా ఆదరిస్తారు.
ఆరోపణ 15: రాష్ట్రం బాగుపడాలంటే దొంగలముఠా చంద్రబాబునాయుడు, ఈనాడు రామోజీరావు, ఎబిఎన్ రాధాకృష్ణ, టివి 5 నాయుడు పోవాలి.
వాస్తవం: ఈ భూమ్మీద ఎవరికి కాలంచెల్లితే వారు పోతుంటారు. ఎవరూ శాశ్వతం కాదు. నీకంటే దారుణంగా మాట్లాడిన నీపూర్వీకులు ఎలా పో యారో ఒకసారి ఏవిధంగా పోయారో ఒకసారి తిరిగి చూసుకో. ప్రజల తరపున పోరాడుతున్న ప్రతిపక్షనేత, పత్రికాధిపతులను రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తున్న మీరు దొంగలముఠా అనడం దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది.