- సౌదీలో బహిరంగంగా తల నరికివేత
- యూఏఈ లో వారం రోజుల్లోనే ఉరి
- ఇరాన్‌లో బహిరంగంగా మరణ శిక్ష
- అఫ్గానిస్థాన్‌లో పాయింట్ బ్లాంక్‌లో కాల్చివేత
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
రాష్ట్రంలో శాడిస్టు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వంలో గత మూడేళ్లుగా మానవ మృగాలు, కామాంధులు మహిళలై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతూ మహిళల కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు. తాజాగా మదపిచ్చి ఎంపి గోరంట్ల మాధవ్ ఒంటిపై బట్టల్లేకుండా వీడితో చాట్ లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించి రాష్ట్రంలో మహిళలకు భరోసా కల్పించాల్సిన జగన్ రెడ్డి పోలీసులు ఎటువంటి ఫోరెన్సిక్ పరీక్షలు, సమగ్ర విచారణ చేయకుండా అడ్డగోలుగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. గతంలో ప్రస్తుత మంత్రివర్గంలో ఇరిగేషన్ మంత్రి పదవిని ఎలగబెడుతున్న అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు సంజన, సుకన్య అనే మహిళలతో కామంతో కళ్లు మూసుకుపోయి మాట్లాడిన మాటలు యావత్ తెలుగురాష్ట్రాల ప్రజలు విన్నారు. జగన్ రెడ్డి అండతో అది తమను కాదని బుకాయించిన కాంబాబు చర్యలకు మెచ్చిన జగన్ రెడ్డి సంబంధిత సంఘటనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేశారు. విశాఖలో సొంత పార్టీకే చెందిన ఓ మహిళతో మంత్రి పదవిలో ఉండగానే అవంతి శ్రీనివాస్ అరగంట వచ్చిపో అంటూ బరితెగించి మట్లాడిన తీరును యావత్ తెలుగు ప్రజానీకం చెవులారా విన్నది. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులే ఇలాంటి చర్యలకు పాల్పడటంతో వారిని ఆదర్శంగా తీసుకున్న మృగాళ్లు రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలను చెరబట్టి అఘాయిత్యాలకు పాల్పడుతూ కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళపై కామాంధులు అత్యాచారం చేయడమే గాక ఆమెను హతమార్చారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని శిక్షించే విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వ అలసత్వమే ఈ విపరిణామాలన్నింటికీ కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు.
రాష్ట్రంలో మహిళలపై మానవమృగాలు రెచ్చిపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు, ముస్లిందేశాల్లో ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారన్న అంశంపై చైతన్యరథం దృష్టి సారించగా పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. వివిధ దేశాల్లో మహిళలపై అత్యచారాలకు పాల్పడితే కాల్చి చంపడం… దీర్ఘకాల జైలు శిక్ష విధించడం వంటి శిక్షలు అమలుచేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారికి పలు దేశాలు కఠినంగా శిక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో వివిధ రూపాల్లో మరణ దండన అమలుచేస్తున్నారు. బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపడం, కాల్చి చంపడం లాంటి కఠినమైన శిక్షణలను ఆ దేశాలు అమలు చేస్తున్నాయి. మరొకసారి కామాం ధులు మహిళల వంక చూడాలంటే భయపడే విధంగా బహిరంగంగా రాళ్లతో కొట్టిచంపడం లాంటి తీవ్రమైన శిక్షలు కూడా విధిస్తారు. కొన్నిదేశాల్లో విచారణను సత్వరం ముగించి కేసులు తీవ్రతనుబట్టి జైలుశిక్ష విధిస్తారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఏ దేశంలో ఎటువంటి శిక్ష పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యాచారాలకు పాల్పడే వారికి పలు దేశాల్లో కఠిన శిక్షలు అమలుచేస్తున్నారు. మదపిచ్చి ఎంపి గోరంట్ల మాధవ్ వ్యవహారం తాజాగా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఏఏ దేశాల్లో ఎటువంటి శిక్షలు విధిస్తున్నారో కనుగొనే ప్రయత్నం చేసినపుడు పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి.
చైనా: ఇక్కడ అత్యాచారం ఘోరమైన నేరం. విచారణ, న్యాయప్రక్రియ చాలా వేగంగా పూర్తిచేస్తారు. నేరతీవ్రతను బట్టి ఒక్కొకసారి పురుషాంగాన్ని తొలగిస్తారు. ఇంకా తీవ్రమైనదైతే తుపాకీతో కాల్చి చంపుతారు. అత్యాచారాన్ని అవమానంగా భావించి చాలా సందర్భాల్లో బాధితులు మౌనంగా ఉండిపోతుంటారు. తేలిందంటే మాత్రం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.
సౌదీ అరేబియా: విచారణ పూర్తయిన కొన్ని రోజుల్లోనే శిక్షపడుతుంది. నేరస్థులకు మత్తుమందు ఇచ్చి బహిరంగ మరణశిక్ష (శిరచ్ఛేదం) అమలుచేస్తారు. కొన్ని సందర్భాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు.
ఉత్తర కొరియా: రేపిస్టులకు ఈ దేశంలో మరణ శిక్షలు అమలవుతాయి. నేరస్థులపై ఎలాంటి దయ చూపించరు. నేరానికి పాల్పడిన వ్యక్తి తలపై లేదా సున్నతమైన అవయవాలపై ఓ ప్రత్యేక బృందం కాల్చిచంపుతుంది.
ఇరాన్: అత్యాచార నేరస్థులకు బహిరంగ మరణ శిక్ష విధిస్తారు. ఉరితీయడం లేదా తుపాకీతో కాల్చి చంపడం వంటి శిక్షలు అమలుచేస్తారు. బాధితుల దయతలచి వదిలేయమని చెబితే మరణశిక్ష నిలుపుదల చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో 100 కొరడా దెబ్బలు, జీవిత ఖైదు విధిస్తారు.
ఇజ్రాయిల్: నేరస్థులకు 16ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు కూడా విధించే అవకాశముంది. ఏవిధమైన లైంగిక నేరానికి పాల్పడినా ఇవే శిక్షలుంటాయి.
నార్వే: అత్యాచారానికి పాల్పడే వారికి 4 నుంచి 15ఏళ్ళ జైలుశిక్ష పడుతుంది. మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా ఏవిధమైన లైంగిక చర్య అయినా అత్యాచారం కిందే పరిగణిస్తారు.
నెదర్లాండ్స్: గట్టిగా ముద్దు పెట్టుకోవడం(ఫ్రెంచి కిస్), లైంగిక వేధింపులను కూడా ఇక్కడ అత్యాచార నేరం కిందే పరిగణిస్తారు. నేర తీవ్రతను బట్టి 4 నుంచి 15ఏళ్ల శిక్ష విధిస్తారు.
ఆఫ్ఘనిస్థాన్: నేరానికి పాల్పడిన 4రోజుల్లోనే శిక్ష పడు తుంది. తలపై కాల్చిచంపడం ఉరితీయడం చేస్తారు. కొన్నిసార్లు బాధితురాలి చేతులతోనే శిక్ష అమలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్: అత్యాచార నేరానికి ఉరిశిక్ష విధిస్తారు. యుఎఇలో నేరస్థుడికి 7రోజుల్లోనే శిక్ష పడుతుంది.
పాకిస్థాన్: బాలలపై లైంగిక దాడులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం… ఈ మూడిరటికీ మరణశిక్ష విధిస్తారు. ఓ మహిళ శరీర భాగాలు బహిరంగంగా కన్పించేలా ఆమెపై దాడికి పాల్పడినా ఇదే శిక్ష విధిస్తారు.
అమెరికా: అమెరికాలో అత్యాచార నేరానికి రెండురకాల శిక్షలు ఉంటాయి. రాష్ట్ర చట్టం, సమాఖ్య చట్టం కింద ఈ శిక్షలు అమలుచేస్తారు. సమాఖ్య చట్టపరిధిలో అత్యాచార నేరస్థులకు గరిష్టంగా జీవిత ఖైదు (30ఏళ్ల జైలు) పడుతుంది. అత్యాచారం సహా వివిధరకాల లైంగిక దాడులకు పాల్పడిన వారికి మూడువిధాలైన శిక్షలు ఉంటాయి. లూసియానా, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధిస్తారు.
క్యూబా: గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి మరోసారి అత్యాచారానికి పాల్పడినా… లేదా 12ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యానికి ఒడిగట్టినా మరణశిక్ష విధిస్తారు.
ఫ్రాన్స్: అత్యాచారాలకు పాల్పడేవారికి ఫ్రాన్స్ లో కనిష్టంగా 15ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. బాధితురాలు మృతిచెందడం వంటి తీవ్రమైన కేసుల్లో 30ఏళ్ల జైలుశిక్ష నుంచి జీవితఖైదు విధిస్తారు.
జపాన్: 20ఏళ్ల జైలుశిక్ష పడుతంది. దోపిడీవంటి నేరాలతోపాటు అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే అవకాశముంది.
రష్యా: కేసు తీవ్రతను బట్టి 4 నుంచి 20ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. నేరస్థులకు 20ఏళ్ల వరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వరు. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే శిక్ష పెరుగుతుంది.