- రూ.413 కోట్లు తీసుకున్నారు ` లోక్ సభలో ధృవీకరించిన కేంద్రం
న్యూఢీల్లి: ఉద్యోగుల జిపిఎఫ్ సొమ్మును వారి అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్ డ్రా చేసిన మాట వాస్తవమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం విజయవాడ ఎంపి కేశినేని నాని లోక్ సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తెలియ పరచకుండా, వారి సమ్మతి లేకుండా ఉద్యోగుల జిపిఏఫ్ ఖాతాల నుండి 2021, 2022 సంవత్సరాల్లో ఎపి ప్రభుత్వం జిపిఎఫ్ సొమ్ము విత్ డ్రా చేసిన మాట వాస్తవమేనా అని అడిగారు. ఈ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ… 2021, 2022 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి 68,020 జిపిఏఫ్ ఖాతాల్లో అంతకు మునుపు జమ చేసిన డిఎ మొత్తం నుండి రూ. 413.73 కోట్ల రూపాయలు విత్ డ్రా చేశారని తెలిపారు.