భీమవరం: రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరుతో 3,4,5 తరగతులను హై స్కూల్లో విలీనం చేయటం తక్షణమే నిలిపివేయాలని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 117 ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తు భీమవరం నియోజకవర్గంలోని 15 పాఠశాలలను విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పాఠశాలల విలీనం వెంటనే నిలిపివేయాలని విద్యాశాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సీతారామలక్ష్మి తెలిపారు.