అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో టీడీపీ ప్రభుత్వాలు రికార్డు స్థాయి ప్రగతి సాధించాయి. ఐటి విప్లవం తెచ్చింది. తెలుగు వారిని విశ్వవ్యాప్తం చేసింది. మద్రాసీలుగా పిలవబడుతున్న తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సంక్షోభాలకు కుంగిపోక అందులోనూ అవకాశాలను ఒడిసిపట్టుకొనే ఆత్మస్థైర్యం పెంచింది. కీ.శే నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లాంటి విశిష్ట నేతల నిలయం టీడీపీ. ప్రగతికి చిరునామా, పెదల పెన్నిధి చంద్రబాబు. భారీ కుంభకోణాలకు, హత్యా రాజకీయాలకు మారుపేరు వైసీపీ నేత. ప్రగతిలో, నాయకత్వ నాణ్యతలో టీడీపీ నేతకు.. ప్రతిపక్ష నేతకు ఉన్న తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత. అయినా టీడీపీ కంటిన్యూగా దీర్ఘకాలం అధికారంలో ఎందుకు ఉండలేకపోయిందో… 43వ ఆవిర్భావ మహోత్సవ సందర్భంగా విశ్లేషించుకోవడం అవసరం. 2004లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఉమ్మడి ఏపీలో 294 నియోజకవర్గ కేంద్రాలన్నీ మినీ సైబరాబాద్‌లై నిరుద్యోగం రూపుమాసిపోయి ఉండేది. 2019లో నైనా టీడీపీ ప్రభుత్వం కొనసాగి వుంటే పోలవరం, నదుల అనుసంధానం పూర్తయి కరువు రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి వుండేది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరిగి మరో సైబరాబాద్ అయి లక్షలాది ఉద్యోగాలు వచ్చి వుండేవి. ఇలా జరగకపోవడానికి కారణాలు ఏమిటి? అలాగే దక్షిణాది రాష్ట్రాలన్నింటి కన్నా ఏపీలో సహజవనరులు, మేధోవనరులు పుష్కలం. అయినా ఏపీ తలసరి ఆదాయం దక్షిణాది రాష్ట్రాలన్నింటి కన్నా ఎందుకు తక్కువగా వున్నది? గుజరాత్‌లో బీజేపీలా టీడీపీ ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో లేకపోవడమే ఏపీ వెనకబాటుకు ప్రధాన కారణం.
టీడీపీ దీర్ఘకాలం అధికారంలో వుండలేక పోవడానికి కారణాలు కొన్ని ఇవి :
సాధించిన విజయాల్ని క్షేత్రస్థాయిలో బ్రాండిరగ్ చేయలేదు.
టీడీపీ అధినేతపై జరిగిన దుష్ప్రచారాల్ని సకాలంలో పూర్తిగా తుడిచిపెట్టలేదు.
వైసీపీ కుట్రల్ని సకాలంలో గుర్తించి ఎండగట్టే విధంగా మన పొలిటికల్ ఇంటిలిజెన్స్ పనిచేయలేదు.
పార్టీపైన పార్టీలోని కొందరు అయాచితంగా చేసిన నెగిటివ్ ప్రచారాలు కూడా నష్టం చేశాయి.
ఈ లోపాలు సరిచేసుకొని విజన్ 2047 విజయవంతానికి కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో కొనసాగాలి.
ఇందుకు టీడీపీ ఉజ్వల చరిత్ర దారా వాహికంగా చైతన్యరథంలో ప్రచురింపబడుతుంది.
అందరూ అద్యయనం చేసి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్