అమరావతి : అర్ధరాత్రి 11.30. నిమిషాలకు సోషల్ మీడియా యాక్ట్విస్టు వెంకటేష్ అక్రమ అరెస్టు చాలా దారుణం. ఈరోజు ఉదయం 6గంటలకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి దౌర్జన్యంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళడం మానవ హక్కులను ఉల్లఘించడమేనని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దొంగల్లా మారారు. వారి ప్రవర్తన దొంగలను తలపించేలా ఉందన్నారు. థరణి కోటలో వెంకటేష్ ఇంటిలోకి ఐదుగురు పోలీసులు గోడ దూకి వెళ్లి అరాచకం సృష్టించారు. పోలీసుల దౌర్జన్యాన్ని వెంకటేష్ చెల్లి వీడియో చీత్రికరిస్తుంటే ఫోనుని లాక్కొని పగలగొట్టడం అన్యాయమన్నారు. ఇంట్లో ఉన్న ట్యూబు లైట్లు, బల్పులను పగలకొట్టి దోపిడికి వచ్చిన దొంగల్లాగ ప్రవర్తించారు. అక్కడ ఉన్న హార్డ్ డిస్కును కూడా పగలగొట్టారు. మీరు ఏం పని చేస్తారు, మీరు ఎవరని వారి తల్లి ప్రశ్నిస్తే ఆమెను కూడా కొట్టడం జరిగింది. వెంట్రావు గదిని పగలగొట్టి అక్కడ ఉన్న వస్తువులన్నిటిని ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. మానవ సమాజం తలదించుకొనే విధంగా పోలీసులు ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. ఈ రాక్షస పాలనలో పోలీసులు మాదే పెత్తనం అనే విధంగా భావిస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి ఎటువంటి జవాబు లేదు. తెలుగుదేశం నాయకులు ప్రశ్నస్తే అతనికి 41ఎ నోటిసు ఇవ్వడానికి వెళ్ళాం, అతను తలుపులు తెరవ లేదు. అందువల్లనే మేము ఆ పని చేశాం. పోలీసులు బరితెగించి ప్రజాస్వామ్య వ్యవస్ధకి తిలోదకాలు పలికారు.
ఒక్క నోటిసు ఇవ్వడానికి ఐదు మంది పోలీసులు అర్థరాత్రి వెళ్ళాలా? సాంబశివరావు అనే వ్యక్తితో వెంకటేష్ తన ఇంటి వద్ద పోలీసులు చేసిన ధ్వంసం గురించి చెప్తే ఫోన్ నెంబరు ఆధారంగా అతనిని కూడ అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ పెట్టారు? ఏ సెక్షన్ మీద కేసు పెట్టారు, ఏ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిష్టరు అయిందొ చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఒక పద్ధతి ఉంది. కేసు రిజిష్టరు అయిన తరువాతనే విచారణ ఉంటుంది, విచారణకు వచ్చిన తరువాతనే నోటిసును పంపిచాలి. ఈ దౌర్జన్యకాండ ఎవరు చప్తే చేశారో, దీని వెనుక ఉన్న వాళ్లకు కూడ సరియైన పరిహారం త్వరలోనే జరుగుతోందన్నారు. ఈ విధంగా ప్రవర్తించిన పోలిసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.