- రూ.1,595 కోట్లతో సిర్మా రావడం శుభపరిణామం
- సీఐఐ సదస్సుతో గ్లోబల్ దృష్టికి ఆంధ్రప్రదేశ్
- లోకేష్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారు
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమిటో చూపించారు
- జగన్ పెట్టుబడిదారులను పారిపోయేలా చేశారు
- విశాఖ సమ్మిట్‌ను డైవర్ట్ చేసేందుకే 12న వైసీపీ ధర్నా
- ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ ఎన్.విజయ్‌కుమార్
మంగళగిరి(చైతన్యరథం): ఏపీ ప్రజల దశ దిశను మార్చేందు కు 17 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అంతా ఈ నెల 14, 15న విశాఖలో ఆవిష్కృతం కానుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ తెలిపారు. ఏపీలో అతిపెద్ద పీసీబీ తయారీ కేంద్రాన్ని పెట్టబడానికి సిర్మా ఎస్‌బీఎస్ ముందుకు రావడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక వారంగా ఈ వారం నిలవనుంది. విశాఖలో 14, 15న సీఐఐ భాగస్వామ్యంతో సదస్సు జరగనుంది. మన దశ దిశను మార్చేందుకు గత 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసిన కృషి అంతా విశాఖలో ఆవిష్కృతం కానుంది. జగన్‌రెడ్డి చేసిన అంకెల గారడిలా ఈ సమ్మిట్ ఉండ దు. ముందుగానే ప్రతి కంపెనీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యి పూర్తి అవగాహనతో సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కోసం గత మూడు నెలల నుండే ప్రతి మంత్రి కృషి చేస్తున్నారు. వివిధ దేశాలకు వెళ్లి అక్కడ అనేకమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు, రోడ్ షోలు నిర్వహించారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పర్యటనలు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై బలమైన నమ్మకాన్ని పెంచింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల ను, మానవ వనరులను వివరించి రాష్ట్రానికి ఆహ్వానించారు. వాటి ఫలితాలే నేడు విశాఖలో చూడనున్నాం. ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సదస్సు నిలవనుంది. వీటి ఫలితాలు రాబోయే 3, 4 సంవత్సరాల్లోనే అందరూ చూస్తారు. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాదు, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను గ్లోబల్ దృష్టికి ఎలా పరిచయం చేశారో నేడు ఆంధ్రప్రదేశ్‌పై గ్లోబల్ దృష్టిని చంద్రబాబు ఆకర్షించనున్నారు. పెట్టుబడులకు మరోసారి ఏపీని గమ్యస్థా నంగా చంద్రబాబు నిలపనున్నారు. 2014-19లో కూడా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన నాయకుడు చంద్రబాబేనని అధికార రికార్డులే చెబుతున్నాయి.
2014-19 మధ్య రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 5.13 లక్షల మంది యువతకు ఉద్యోగా లు వచ్చాయని నాటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో సాక్షిగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు అదే అభివృద్ధి శకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే నాందిగా విశాఖలో జరుగనున్న ఈ సీఐఐ సమ్మిట్ ఉండబోతోంది. రాష్ట్ర అభివృద్ధి మళ్లీ ట్రాక్‌పైకి వచ్చిందని ప్రపంచానికి చూపించే వేదికగా ఇది నిలుస్తోంది. ఈ సమ్మిట్‌లో సుమారు రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు కుదరబోతున్నాయి. దీని ద్వారా రాష్ట్ర యువతకు 7.5 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశ ముంది. 20 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి వచ్చిన సంకేతంగా భావించవచ్చు. గతంలో జగన్‌రెడ్డి కూడా సీఐఐ భాగస్వామ్యంతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ అంటూ డ్రామాలు అడాడు. నాడు ఒప్పందాలు చేసుకున్న రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రూ.9 లక్షల కోట్ల వరకు బినామీ ఒప్పందాలే. మిగిలిన పెట్టుబడులు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. కాలేజీ విద్యార్థులకు కోటులు వేసి బ్రోచర్లనే ఒప్పందాలుగా చూపించారని దుయ్యబట్టారు.
డిస్ట్రక్షన్ నుంచి డెవలప్‌మెంట్ వైపుకు ఏపీ అడుగులు
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఐటీ రంగానికి కేంద్రంగా విశాఖను మారుస్తున్నారు. రాష్ట్రాన్ని ఏఐ హబ్‌గా నిలుపుతున్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరుస్తున్నాం. పరిశ్రమలను ఆకర్షిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకటనతో రాయలసీమ వెలిగిపోతుంది. ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లా జీడీపీ అధికంగా ఉంది. అది కేవలం చంద్రబాబు విజన్‌తోనే సాధ్యమైంది. విశాఖ, అనంతపురం, తాడేపల్లిగూడెం, కర్నూలు, గన్నవరం ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఓర్వకల్లు, కొప్పర్తి నాడ్‌లు కేంద్ర సహకరాంతో అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలం చంద్ర బాబు, లోకేష్ శ్రమ వలనే సాధ్యమైంది. ప్రపంచ ఆర్థిక వేదికలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా మన మంత్రులు నిలిపారు. టీసీ ఎస్ కంపెనీ విశాఖలో బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. త్వరలో ప్రారంభం కానుంది. 15 బిలియన్ డాలర్లతో గూగుల్ ఏఐ సిటీని నిర్మించనుంది. దీని ద్వారా 1.80 లక్షల మంది యువ తకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందనున్నాయి. అనకాపల్లిలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ కంపెనీలు పెట్టనున్నాయి. అమరావతిలో క్వాంటం వ్యాలీని ఐబీఎం, టీసీఎస్ నెలకొల్పనుంది. వీటితో పాటు ఎంఎస్‌ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్స హిస్తుంది. ఇలా అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుం డా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు పెట్టుబడుల వికేంద్రీకరణకు ప్రభుత్వం పూనుకుంది. వీటన్నింటినీ, సీఐఐ సమ్మిట్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే జగన్‌రెడ్డి 12న పీపీపీ విధానంపై ధర్నాకు పిలుపునిచ్చాడు. విశ్వామిత్రుని యాగంలో ఉంటే మారీచులు సారాయి పోసినట్లు జగన్‌రెడ్డి పెట్టుబడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. విశ్వామిత్రుని యజ్ఞాన్ని రామ లక్ష్మణులు ఏ విధంగా నిర్విజ్ఞంగా కొనసాగించారో అలానే పెట్టు బడుల వరద అనే యజ్ఞాన్ని చంద్రబాబు, లోకేష్‌లు ఉన్నంత కాలంగా మారీచుడులాంటి జగన్‌రెడ్డి ఏమి చేయలేడు. పెట్టుబడు లను అడ్డుకోవడం జగన్‌రెడ్డి తరం కాదు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా ముందుకువెళుతుందని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం
దేశంలోనే అతిపెద్ద పీసీబీ తయారీ కేంద్రం మన ఏపీలో పెట్టనుంది. సిర్మా ఎస్‌జీఎస్ రాష్ట్రానికి రావడానికి కారణం వేగంగా అన్ని అనుమతులు ఇవ్వడమే. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దేశీ దిగ్గజం అయిన సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ లిమిటెడ్ మన రాష్ట్రాన్ని ఎంచుకుంది. రూ.1,595 కోట్లతో భారీ పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క దార్శనికతకు, చిత్తశుద్ధికి తిరుగులేని నిదర్శనం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,170 మంది స్థానిక యువతకు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలకు ప్రభుత్వం తరపున ‘రెడీమేడ్ టైలర్‌మేడ్ సొల్యూషన్స్’ తక్షణమే అందించి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో తెలియజేసింది. ఏటా సైన్స్, టెక్నాలజీ, ఇంజ నీరింగ్ నైపుణ్యం కలిగిన యువత మన రాష్ట్రంలో అందుబా టులో ఉండడం, ఎగుమతులు, దిగుమతులు సులభతరం చేసే పోర్ట్‌లకు దగ్గరగా ఉండటం కూడా కలిసి వచ్చింది. ‘‘మాకు వేగం కావాలి. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నాం’’ అని సెర్మా ఎస్‌జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎస్ గుజ్రాల్ స్పష్టంగా తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో దేశంలో సత్తా చూపిన తరువాత, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని మన మంత్రి లోకేశ్ అన్న మాటలు దిగ్గజ సంస్థలను మంత్రం లా ఆకర్షించాయి.
పరిశ్రమలకు మన ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఫలితాలు వస్తున్నాయి. ఈ పెట్టుబడి ద్వారా దేశం ఏటా సుమారు వి70 బిలియన్ల ఎలక్ట్రానిక్స్ దిగుమతి బిల్లును తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. స్వదేశంలోనే తయా రీ(దీaషసషaతీస Iఅ్‌వస్త్రతీa్‌ఱశీఅ)జరగడం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లో ఒక పటిష్టమైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మారి వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందు తుంది. ప్రీమియర్ ఎనర్జీస్ తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించడం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ సీఐఐ సమ్మిట్‌లో అందరూ పాల్గొనాలని, వీలైతే వారిని ఘనంగా స్వాగతించాలని వైసీపీ నేతలను కోరారు. సమ్మి ట్ విశాఖలోనే జరుగుతుంది, కానీ పెట్టుబడులు రాష్ట్రం మొత్తం వస్తాయని, అందువల్ల ఇది రాజకీయంగా వాడుకోవద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు. పెట్టుబడులకు సహకరించండి.. విషం చిమ్మడం మానుకోండని హితవుపలికారు.















