బాధ్యతగల పదవిలో ఉండి అంబటి ఫేక్ ట్వీట్
ఫేక్ ట్వీట్ పై అంబటిని విచారించే దమ్ముందా?
అమరావతి: మహానాడు విజయవంతం కావటంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భయంతో వణికిపోతున్నారని, తన పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఫేక్ ట్వీట్లతో ప్రజల్లో కుల, మత,ప్రాంత చిచ్చుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగన్ రెడ్డి అండ్ పీకే టీం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫేక్ ట్వీట్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మా పార్టీ నేతలైన వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బచ్చుల అర్జునుడు సహా తన పేరుతో కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ట్వీట్లు పెట్టారని, చివరకు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతకం, పార్టీ లెటర్ హెడ్ పోర్జరీ చేశారని, బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు ఆ ఫేక్ ట్వీట్ ను సమర్ధిస్తూ ట్వీట్ చేశారంటే అందులో ఉన్న కుట్రకోణం అర్దమౌతోందని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పేక్ ట్వీట్లను మంత్రే షేర్ చేస్తున్నారంటే దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫేక్ ట్వీట్లపై రేపు ఉదయం 11గంటలకు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దీనిపై అంబటి రాంబాబును విచారించే దమ్ము సీఐడీ చీప్, పోలీసులకు ఉందా? స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న మనువరాలు గౌతు శిరీష ఇంటికి సీఐడీ పోలీసులు అర్దరాత్రి పూట వెళ్లి నోటీసులు ఇవ్వటం దుర్మార్గం. ఇవాళ ఆమెను సీఐడీ ఆపీస్ కి పిలిచి ఉదయం నుంచి కనీసం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయకుండా వేధించారు. ఏం కేసు పెడుతున్నారో కూడా నోటీసులో చెప్పకుండా విచారణకు పిలిచారు. రేపు ఇదేవిధంగా మంత్రి అంబటి రాంబాబును సీఐడీ ఆఫీస్ కు పిలిచి విచారింటే దమ్ము దైర్యం సీఐడీ పోలీసులకు, ముఖ్యమంత్రికి ఉందా? రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికొదిలి, పోలవరాన్ని నాశనం చేసి ఫేక్ ట్వీట్లతో అంబటి కాలక్షేపం చేస్తున్నారు. మహానాడు విజయంతో జగన్ రెడ్డికి భయం పట్టుకుంది. సజ్జల డైరక్షన్ లేకుండా బాద్యతగల మంత్రి ట్వీట్ చేయగలరా? ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలన్నా సాక్షి మీడియాలో తయారు చేసిన సజ్జల స్ర్కిప్ట్ మాత్రమే వారు మాట్లాడాలి. ఫేక్ ట్వీట్ చేసినందుకు మంత్రి అంబటి రాజీనామా చేస్తారా? లేక క్షమాపణ చెబుతారా? ముఖ్యమంత్రి అంబటిని మంత్రి పదవి నుంచి భర్తరప్ చేస్తారా? లేక కేసు బుక్ చేసి అంబటిని విచారణకు పిలుస్తారా? పరిపాలన వైఫల్యంతోనే పేక్ ట్వీట్ చేస్తున్నారు. 3ఏళ్లలో రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్లు అప్పుల్లోకి నెట్టారు. బుర్ర తక్కువ రాంబాబు, డయాఫ్రం వాల్ రాంబాబు, ఫేక్ ట్వీట్ రాంబాబుగా చరిత్రలో నిలిచిపోతారని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.