భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.
భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. బ్రిక్స్ యువజన, క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అధికారిక విందు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడారు.