- డీప్ టెక్ స్కిల్లింగ్‌తో అందుబాటులోకి ప్రపంచస్థాయి టెక్నాలజీ
- టెక్నాలజీ డే సందర్భంగా ఏపీలో భారీ డీప్‌టెక్ స్కిల్లింగ్ మిషన్
- ఎన్పీటీఈఎల్ పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు
- టెక్నాలజీ డే సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు అభిప్రాయాలు
ఢిల్లీ (చైతన్య రథం): “జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా భారత భవిష్యత్తును సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నిర్మిస్తున్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ భారత శాస్త్రీయ విజయాలను స్మరించుకునే రోజు. పోఖ్రాన్ విజయాన్ని గుర్తు చేసుకునే రోజు. పోఖ్రాన్ విజయంతో మన దేశ సామర్థ్యాన్ని, శక్తిని, ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాం. నాలెడ్జ్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి అంశాలతో స్థిరమైన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని పోఖ్రాన్ విజయం నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తోంది. భవిష్యత్ సాంకేతిక రంగాల్లో బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తూ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉంది” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
“ఐబీఎం స్కిల్స్‌బిల్డ్, ఏపీఎస్‌సీహెచఈ, ఏపీఎసఎస్‌డీసీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీస్థాయి డీప్-టెక్ స్కిల్లింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రంగాలను కవర్ చేస్తూ 2026-27 నాటికి 2 లక్షలమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నాం. అలాగే వచ్చే ఐదేళ్లలో 10 లక్షలమందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో శిక్షణ కార్యక్రమం రూపొందించాం. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలు, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల ద్వారా ఈ ప్రొగ్రామ్ అమలు చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేలా నాగార్జున యూనివర్శిటీలో ఎనఐఈఎలఐటీ ఇన్నోవేషన్ మరయు స్కిల్లింగ్ సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కమ్యూనికేషన్, సెమీకండక్టర్ టెక్నాలజీలపై ఈ కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ విద్యా సంవత్సరంలోనే కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. దీని ద్వారా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. దీంతో వేలాది విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు లబ్ధి పొందనున్నారు” అని సీఎం పేర్కొన్నారు.
“జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎన్పీటీఈఎల్ జాతీయ పరీక్షల్లో 4 బంగారు పతకాలు, 14 రజత పతకాలు సాధించిన మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అభినందిస్తున్నా. మన రాష్ట్రంలోని ప్రతిభ, కృషి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ఎకోసిస్టమ్‌కు ఈ విజయాలే నిదర్శనం. క్వాంటమ్ వ్యాలీ విజన్‌తో భవిష్యత్‌ను అందిపుచ్చుకునేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న క్రమంలో మరింతమంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్ములు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కోర్సులు, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.













