ప్రొద్దుటూరు: ముస్లిం పెద్దలతో సంప్రదించకుండానే దస్తగిరిస్వామి జెండాచెట్టును కూల్చివేయడం దుర్మార్గమని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. జెండా చెట్టు కూల్చి వేసిన తర్వాత లింగారెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జెండాచెట్టు కూల్చివేత విషయం తెలిసి, తాము వెళ్లబోతే అడ్డుకున్న పోలీసులు, అక్కడ వైసీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ధర్నా చేస్తే ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇదంతా హైడ్రామాగా అభివర్ణిస్తూ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరంతా వైసీపీకి రాజీనామా చేసి వస్తే, జెండా చెట్టు తిరిగి ఏర్పాటులో టీడీపీ కూడా కలిసొస్తుందన్నారు. ముస్లింల ఆస్తులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆహంకార ధోరణితో వెళ్తున్నాడని విమర్శించారు. ముస్లింలకు చెందిన జామీయా మసీదు ఆస్తులను కూల్చివేశారని అన్నారు. ఇపుడు ముస్లింలు ప్రార్థనలు చేసే జెండాచెట్టును నిరంకుశంగా మున్సిపల్ అధికారులతో కూల్చివేయించారన్నారు.