అమరావతి (చైతన్యరథం): సిమెంట్ ఫ్యాక్టరీల కార్మికులు, యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో మంత్రి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రికి యాజమాన్య ప్రతినిధులు విన్నవించారు. ఈ భేటీలో కార్మికుల సమస్యలపైనా మంత్రి సుభాష్ చర్చించారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ లో కార్మికుల సమస్యలపైనా మంత్రి సుభాష్ చర్చించారు. యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తూనే.. కార్మికులకు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.