కర్నూలు: సీఎం జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ప్రజలు భయపడుతున్నారని… ఇంటికి సురక్షితంగా తిరిగి వస్తామనే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. అన్నీ రహదారులు కూడా గుంతలమయమై పోయాయని గుర్తు చేశారు. కనీసం రాష్ట్రంలో ఒక్క గుంత కూడా పూడ్చలేదని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను జగన్ వేధిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.