- ప్రజావినతుల కార్యక్రమానికి తరలివచ్చిన బాధితులు
- అర్జీలు స్వీకరించిన నెట్టెం రఘురాం, పి.వి.జి.కుమార్
- సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కొప్పుల వెలమ కార్పొ ంషన్ చైర్మన్ పి.వి.జి.కుమార్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` తమ కుటుంబం కాకుమాను మండలం తెలగాయపాలెం నుంచి బతుకుదెరువు కోసం బాపట్ల వెళితే మల్లంపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ భూమికి దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశాడని తమ భూమిని విడిపించి తనకు న్యాయం చేయాలని బాపట్లకు చెందిన చామర్తి స్వామి నేతలకు విజ్ఞప్తి చేశాడు.
` తాను టీడీపీ సానుభూతి పరుడిననే కారణంతో స్థానిక వైసీపీ నాయకులు తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం గంపలగూడెం గ్రామానికి చెందిన మరీదు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు మార్గంలో తన పురుగుమందుల షాపును సీజ్ చేయించి తన జీవనాధారంపై దెబ్బకొట్టారని…తనకు న్యాయం చేసి సీజ్ చేసిన షాపును తెరిపించాలని వేడుకున్నాడు.
` తాము వ్యాపారం కోసం ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం పెద గోగులపల్లె గ్రామం నుంచినందిగామకు వెళ్లగా తమ భూమిని మాదాల శ్రావణి అనే మహిళ తన పేరుమీదకు మార్చుకుందని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన చిన్న అంకయ్య ఫిర్యాదు చేశారు. దీనికి సహకరించిన అధికారులు, భూమిని కొట్టేసేందుకు అక్రమంగా ఎక్కించుకున్న మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
` తనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు తమ భూమికి పట్టా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కడప జిల్లా సిద్ధవటం వెంకటాయపల్లె గ్రామానికి చెందిన జ్యోతి దానమ్మ ఫిర్యాదు చేసింది. దయచేసి తాము సాగుచేసుకుంటున్న భూమికి పట్టా ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
` తనకు గత టీడీపీ ప్రభుత్వంలో ఒంటరి మహిళ పింఛన్ వచ్చేదని తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన పింఛన్‌ను తొలగించిందని గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడుకు చెందిన గట్టికొప్పులు కుమారి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎటువంటి ఆధారం లేదని..తనకు గతంలో వస్తున్న ఒంటరి మహిళా పింఛన్ ను ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంది.
` పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఉప్పు తోళ్ల నాగేశ్వరరావు సమస్యను వివరిస్తూ తమ స్వగ్రామమైన ముటుకూరులో తమకు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని చల్లా రాఘవులు అనే వ్యక్తి అక్రమంగా ఇతరులకు అమ్మాడని అతనిపై చర్యలు తీసుకుని తన భూమి తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` తనకు వారసత్వంగా వచ్చిన భూమి, తన స్వాధీనంలో ఉన్న భూమికి అన్ని డాక్యు మెంట్లు ఉన్నా అధికారులు ఆన్‌లైన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన చాపా గాలిరెడ్డి ఫిర్యాదు చేశారు. దయ చేసి తన భూమిని తన పేరుపై ఆన్‌లైన్ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` తనకు పిత్రార్జితంగా సంక్రమించిన పొలాన్ని హనుమంతు అనే వ్యక్తి కొట్టేసేం దుకు యత్నిస్తున్నాడని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన బోయ కాశీనాథ్ ఫిర్యాదు చేశాడు. అతని చర్యలకు అధికారులు అడ్డుకట్ట వేసి తన భూమిని తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.