చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అమరావతి భూములమ్మే హక్కు సీఎంకు లేదు : మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

న్యాయపోరాటానికి రాజధాని రైతులు సిద్ధం

by చైతన్యరధం
June 27, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అమరావతి భూములమ్మే హక్కు సీఎంకు లేదు : మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.స్థలాలను అమ్మకానికి పెట్టి జగన్‌ రాక్షసానందం
.జీఓ ఎంఎస్‌ 390ని రద్దు చేయాలి
.రైతుల త్యాగాన్ని సొమ్ము చేసుకోవాలనుకోవడం దుర్మార్గం
.గ్రాఫిక్స్‌ అని చెప్పి సిగ్గులేకుండా ఎలా అమ్ముతారు?

 

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అమరావతి భూములను అమ్మే హక్కు ఎక్కడుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలనలో రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 6న ప్రభుత్వం జీవో ఎంఎస్‌ 390ని విడుదల చేశారని తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాలు విజయవాడ, తెనాలి లోని 304 ఎకరాల భూమిని జూలై రెండవ వారంలో కొన్ని, నాల్గవ వారంలో కొన్ని అమ్మాలని సీఆర్డీఏ నిర్ణయం చేస్తే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిపారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలని కుట్రచేసిన ముఖ్యమంత్రి అదే రాజధానిలోని భూములను లీజుకు ఇవ్వడం, అమ్మాలని చూడడం ఎంతవరకు సబబని నిలదీశారు. ముఖ్యమంత్రికి అసలు నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై గౌరవ హైకోర్టు 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును జగన్‌ రెడ్డి తుంగలో తొక్కారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాజధాని రైతులకు చేసిన వాగ్ధానాలను అమలు చేయాలని, వారికి సంబంధించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోర్టు తీర్పునిస్తే ముఖ్యమంత్రి అది చేయకుండా ఆ స్థలాలను అమ్మేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రాజధాని ప్రాంతం ప్రజలు, రైతులు సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ రాజధానికి తమ భూములను త్యాగం చేసిన రైతులు, నేడు రాజధానిని కాపాడుకోవడానికి గత మూడేళ్లుగా పోరాడుతూనే ఉన్నారన్నారు. అటువంటి రైతులపై వైసీపీ ప్రభుత్వం ఆడ, మగ, మహిళ, పిల్ల తేడా లేకుండా పోలీసులతో మూకుమ్మడి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. రైతులు చేస్తున్న పోరాటనికి పేటీఎం పోరాటమని విమర్శించి అవమానపరిచారన్నారు. రాజధాని ప్రాంతంలోని దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్మోహన్‌ రెడ్డిదని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని కేవలం ఎడారి, శ్మశానం, త్రీడీ గ్రాఫిక్స్‌ అని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి, తన అనుచరగణం నేడు సిగ్గులేకుండా ఏ విధంగా అదే భూములను అమ్మాలని చూస్తున్నారని ప్రశ్నించారు.

జగన్‌ ముఖ్యమంత్రి అయిన ఈ మూడేళ్లలో తలకు మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. అప్పల సమస్యలతో రాష్ట్రాన్ని ముందుకు నడపలేని దుస్థితిలో అమరావతి భూములపై జగన్‌ కన్ను పడిరదని తెలిపారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన హ్యాపీ నెస్ట్‌ను సీఎం నీరుగార్చారని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ ఫలాలు దక్కాలంటే ప్రతి విషయంలోనూ కోర్టుకు వెళ్లే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతుల త్యాగ ఫలితంతో ఏర్పడిరదే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ…వీటికి వెళుతున్న సీఎంకు రైతులు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. రాజధానిని నిలబెట్టుకోవడానికి చేసిన పోరాటాల్లో ఎందరో రైతులు అశువులుబాశారని తెలిపారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన ముఖ్యమంత్రికి రాజధాని పోరాటంలో అశువులుబాసిన రైతులు గుర్తుకు రాలేదా, వారికి ఓదార్పు యాత్రలు లేవా అని కోరారు. రాజధాని భూములు లీజుకు ఇవ్వడం, అమ్మడం వంటి చర్యలను సీఎం ఉపసంహరించుకోవాలని, జీఓ ఎంఎస్‌ 390ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయపోరాటానికి రైతాంగం, రాజధాని ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు.

Tags: 304 ఎకరాల భూమిఅమరావతిఅమరావతి భూములు లీజుఒక్క ఇటుకజగన్ రెడ్డిజీవో ఎంఎస్‌ 390భూములను త్యాగం చేసిన రైతులు
Previous Post

వైసీపీ ప్రభుత్వంలో… పన్నుల వాతలు… పథకాలకు కోతలు! : చంద్రబాబునాయుడు

Next Post

టీడీపీ మహిళనేత వంగలపూడి అనితపై వైసీపీ నేత చంగల వెంకట్రావు వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఆందోళన

మరిన్ని వార్తలు

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

November 5, 2026
జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

November 5, 2026
అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం
ఆంధ్రప్రదేశ్

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

November 5, 2026
కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి

November 5, 2026
వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

November 5, 2026
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
Next Post
టీడీపీ మహిళనేత వంగలపూడి అనితపై వైసీపీ నేత చంగల వెంకట్రావు వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఆందోళన

టీడీపీ మహిళనేత వంగలపూడి అనితపై వైసీపీ నేత చంగల వెంకట్రావు వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఆందోళన

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

by కార్యకర్త
November 5, 2026

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

by చైతన్యరధం
November 5, 2026

ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారని ప్రశంస అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోను చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి...

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

by చైతన్యరధం
November 5, 2026

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలి కూటమి పార్టీల ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): గురువారం జరగబోయే జిల్లా పరిషత్,...

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

by చైతన్యరధం
November 5, 2026

అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతో అత్యుత్తమ విధాన రూపకల్పన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా చూడాలన్న మంత్రి లోకేష్ సీఎంతో సమావేశమైన...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.