విశాఖపట్నం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా ప్రచారం చేపట్టి యువతని రక్షిస్తుంటే, వైసీపీ మాత్రం, యువతని డ్రగ్స్‌కి బానిసలుగా మార్చేందుకు చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నానికి వస్తుండగా, చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ కలిసి ఆదివారం పట్టుకున్నాయి. అతని వద్ద నుండి 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు. చరణ్‌ని పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్ట్రిప్స్‌ను వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకువస్తున్నట్టు చరణ్ వెల్లడిరచాడు. ఈ క్రమంలోనే కొంతమంది రాజకీయ నేతలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్ దందాని పూర్తిగా అరికడతామన్నారు. డ్రగ్స్‌పై ఎలాంటి సమాచారం తెలిసినా తమకు వెంటనే తెలియజేయాలని ఈగల్ టీం, విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సూచించారు














