యువతను ఉద్యోగాల పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసానికి పాల్పడిరదంటూ చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి యువ మోర్చా అధ్యక్షుడు వరుణ్ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షుడు వరుణ్ మాట్లాడుతూ పరిపాలన రాకముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ నిరుద్యోగులకు ఆశ చూపి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా మత్తు పదార్థాలకు యువత బానిసలు అయ్యేలా వైసీపీ ప్రభుత్వం వ్యాపారం నిర్వహిస్తుందని, గంజాయి అక్రమ మద్యం, అవినీతి పాలనకు నిదర్శనగా నిలిచాయన్నారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.