- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
- విశాఖపట్నంలో రెండేళ్ల వేడుకలు
విశాఖపట్నం(చైతన్యరథం): యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తయి న సందర్భంగా విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 60 కిలోల భారీ కేకు కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది..పాదయాత్ర మొత్తం 97 నియోజకవర్గాల్లో కొనసాగగా 90 నియోజక వర్గాల్లో టీడీపీ అఖండ మెజారిటీ సాధించిందన్నారు. యువత, మహిళలు, రైతులు, మైనారిటీల సమస్యలు, ఆశయాలు ప్రతిబింబించాయని పేర్కొన్నారు. అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ నారా లోకేష్ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారని, రాయలసీమ రాతను మార్చిన ఈ పాదయాత్ర టీడీపీ విజయానికి కీలకంగా నిలిచిందన్నారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని నేతలు స్పష్టం చేశారు. యువగళం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని సం పాదించుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, ఘనబాబు, గండి బాబ్జి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, రాష్ట్ర కార్యదర్శి పట్టాభి, పీల శ్రీనివాస్, కోరాడ రాజబాబు పాల్గొన్నారు.