- ఇక మూడురోజులే మిగిలివుంది..
- రాష్ట్ర వినాశకుడిని తరిమికొట్టండి
- భూహక్కు చట్టాన్ని తగులబెట్టండి
- మీ భూమి మీకుండాలంటే కూటమి రావాలి
- రాజముద్రవేసి మీకు పాసు పుస్తకాలిస్తాం..
- ప్రజా గెలుపునకే మూడుపార్టీల అజెండా
- పోలవరం పూర్తిచేసి, నిర్వాసితులకు సాయం
- వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం
- ఉద్యోగులు, పోలీసుల సమస్యలు పరిష్కరిస్తా
- ప్రజాగళం సభలలో చంద్రబాబు ఉద్ఘాటన
- ప్రజాగళం సభలన్నీ.. ప్రభం‘జనమే’
ఉండి, ఏలూరు, గన్నవరం (చైతన్య రథం): రాష్ట్ర భవిష్యత్, మీ బిడ్డల భవిష్యత్ బావుండాలంటే దోపిడీ ప్రభుత్వానికి స్వస్తిపలికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, అందుకు మూడు రోజులే సమయముందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమిని గెలిపించి ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ఊపిరిపోయాలన్నారు. ‘మీరు వేసే ఓటు రైతులకు గిట్టుబాటు ధర తెస్తుంది. యువతకు ఉద్యోగాలిస్తుంది. మహిళలకు రక్షణనిస్తుంది. నిత్యవసర ధరలు, కరెంట్ చార్జీలు తగ్గిస్తుంది. మీ ఓటు రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతుందని చంద్రబాబు ఉద్వేగంగా పిలుపునిచ్చారు. మే 13న మీరు వేసే ఓటు.. తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలుకొడుతుందని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కిపోయిందంటూ.. పోలవరం పూర్తయివుంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేదన్నారు. నా కుటుంబంపై వైసీపీ మూకలు చేసిన దాడికంటే.. రాష్ట్రాన్ని కొట్టిన దెబ్బకే ఎక్కువ బాధ కలుగుతుందని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేసి, మీ బిడ్డల భవిష్యత్‌ను కాపాడతానన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా శుక్రవారం మొదటి సెషన్‌లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఉండి, ఏలూరు, గన్నవరం సెగ్మెంట్లలో పెద్దఎత్తున ప్రజాగళం సభలు నిర్వహించారు. ఒకదాన్నిమించి మరో సభకు జనం పోటెత్తడంతో, చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసాలతో ప్రజలను చైతన్యపర్చారు. తన వాగ్దాటితో వైసీపీ పాలనా వైఫల్యాలను దునుమాడుతూనే.. సందర్భోచిత ఛలోక్తులతో ఆసాంతం ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమన్న సానుకూల వాతావరణం కనిపిస్తుండటంతో.. టీడీపీ అగ్రనేత ప్రచార వేగాన్ని మరింత ఉధృతం చేశారు. జగన్ సైకోయిజం, పాలనా వైఫల్యాలపై విరుచుకు పడుతున్నపుడు.. ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొట్టడం కనిపించింది.
కూటమి విజయానికి స్పందనే సంకేతం…..
కూటమి భారీ విజయాన్ని పోటెత్తుతున్న ప్రజాస్పందనే ప్రతిబింబిస్తుందని అంటూ, ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే కూటమిలోని మూడు జెండాల అజెండాగా చంద్రబాబు అభివర్ణించారు. జగన్‌తో విబేధించారని ఎంపీ రఘురామకృష్ణంరాజుని టార్చర్ పెట్టారని ఆగ్రహించారు. ఎండలకు భయపడి ఇంట్లో కూర్చుంటే మన ఇళ్లకు గొడ్డళ్లు వస్తాయని చమత్కరిస్తూ.. మే 13న పోలింగ్ స్టేషన్లు అదిరిపోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి రూ.1000 కోట్లు దోచుకున్న బందిపోటు జగన్ అంటూ, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు, పన్నుల పెంపుతో ప్రజలపై మోయలేని భారం వేశాడన్నారు. జె.బ్రాండ్స్‌తో కోట్లాది రూపాయలు కొల్లగొట్టి, ప్రజల జీవితాలతో చెలగాటమాడాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాజముద్ర స్థానంలో జగన్ బొమ్మెందుకు?
తాతముత్తాతల నుంచీ ఆస్తిగా వస్తున్న భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిమీద ఉండాల్సింది ప్రభుత్వ రాజముద్రే కాని జగన్ ఫోటో కాదన్నారు. నా నా నా అంటూ జగన్ సాగదీసే ‘నా’ అంటే నాశనమని బాబు చమత్కరించారు. నా ఎస్సీలంటూనే దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. నా బీసీ అంటూ స్కీములన్నీ రద్దు చేశారు. మీ బిడ్డ అంటూనే మీ భూములు కాజేయడానికి కొత్తగా ప్రమాదకరమైన చట్టం తెచ్చాడని ఆగ్రహించారు. జగన్ ఆటలు ఇక సాగవంటూనే.. కూటమి అధికారంలోకి రాగానే పట్టాదారు పాసుపుసక్తం మీద జగన్ బొమ్మ తీసేసి ప్రభుత్వ రాజముద్ర వేయిస్తానునని బాబు ప్రకటించారు. మీ భూమి మీది కావాలంటే కూటమిని గెలిపించాలని, అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు చేస్తానని ప్రకటించారు.
జగన్ ఒక్క హామీ నెరవేర్చ లేదు….
మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్నాడు. చేశాడా? సీపీఎస్ వారంలో రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? ద్యుత్ చార్జీలు పెరగవని చెప్పి 9సార్లు పెంచాడు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అంటూ జగన్ మాటిచ్చి మడమతిప్పిన హామీలను చంద్రబాబు ప్రస్తావించారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అవి వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇంటి నుంచే పని చేసే విధానానికి ప్రాధాన్యమిస్తామని బాబు ప్రకటించారు. నరేంద్ర మోడీ 4 కోట్ల ఇళ్లు కడతామని గ్యారెంటీ ఇచ్చారని గుర్తు చేస్తూ, అది కాకుండా గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్‌లో 2 సెంట్లు భూమి ఇస్తామని, ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ప్రత్యేకహోదా జగన్ తెచ్చాడా? తెస్తాడా? రాజధానిని సర్వనాశనం చేశాడా? లేదా? అని నిలదీస్తూ.. మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటించారు.
సిసలైన సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది…..
జనసేనాని పవన్‌తో కలిసి తెలుగుదేశం రూపొందించిన సూపర్ సిక్స్‌తోపాటు మోడీ గ్యారెంటీ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. లబ్దిదారులకు రూ.4వేల ఫింఛన్ ఇస్తూ, ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన్నారు. చంద్రన్న బీమా ద్వారా సహజ మరణం అయితే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ అయితే రూ.10 లక్షలు, బీసీ డిక్లరేషన్ ఇస్తామన్నారు. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బీసీలను ఆదుకుంటామని, కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. రవాణా రంగంలో పని చేసే డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తామని, చెత్త పన్ను రద్దు చేసి, విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామన్నారు. డ్రగ్స్, గంజాయి 100 రోజుల్లో ఉక్కుపాదంతో అణచివేస్తాం. సురక్షిత మంచి నీరు ఇంటింటికి కుళాయి ద్వారా అందిస్తామన్నారు.
ఉద్యోగుల సంక్షేమం భాద్యత నాది…..
వైసీపీ ఎంత ప్రలోభపెట్టినా ఉద్యోగులంతా ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లేశారు. అధికారంలోకి రాగానే ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తానని బాబు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రతి నెలా 1నే జీతాలిస్తామని, పెండిరగ్ డీఏ, టీఏ, జీపీఎఫ్, ఐఆర్ సాధ్యమైనంత త్వరలో ఇస్తామని అంటూ, మెరుగైన పీఆర్సీ, హెల్త్ స్కీం తెస్తామన్నారు. 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని, ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్థలాలిస్తామన్నారు. పోలీసులకు పెండిరగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌ని సొమ్ము చేసుకునే అవకాశమిస్తామని, రద్దైన అలవెన్సులు ఇస్తామని, వీక్లీ ఆఫ్ అమలు చేస్తామన్నారు. హోంగార్డుల జీతం రూ.25 వేలకు పెంచుతామన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అంగన్వాడీ, ఆశావర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని, పొదుపు సంఘాల యానిమేటర్లుకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. గోపాల మిత్ర, ఆరోగ్య మిత్ర, భీమా మిత్రలకు న్యాయం చేస్తామని, జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదన్నారు.
నియోజకవర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం…..
ఉండి, ఏలూరు, గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇస్తూ.. ఉండిలో డ్రైనేజ్ వ్యవస్థపై స్లాబ్‌లు వేయిస్తామని, రైల్వే ప్లౖౖెఓవర్ నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక పట్టణంగా ఆకువీడును తయారు చేస్తామని, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఏలూరులో దుర్మార్గులు పాడుచేసిన శ్మశాన వాటికను బాగు చేస్తామన్నారు. జిల్లాల వారీగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని ఎమ్మార్పీఎస్ నాయకులకు హామీ ఇస్తున్నా. అన్న క్యాంటీన్‌తో పేదలకు అన్నం పెడతామని, చంద్రన్న భీమా, విదేశీ విద్యవంటి సంక్షేమ పధకాలు పునరుద్ధరిస్తామని చంద్రబాబు వెల్లడిరచారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు రఘురామ కృష్ణంరాజు, బడేటి కోట రామారావు, యార్లగడ్డ వెంకటరామారావు, ఎంపీ అభ్యర్థులు బాలశౌరి, భూపతిరాజు శ్రీనివాస వర్మలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.