అమరావతి (చైతన్య రథం): బాపట్ల పట్టణం వృక్షనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్న యాతం సౌజన్య అంకితభావం, బోధనా తీరుపట్ల విద్యా మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. ‘‘మీ వినూత్న విద్యాబోధన పిల్లల సమగ్ర విద్యా, విజ్ఞాన వికాసానికి దోహదపడుతోంది. దీక్షా ఫ్లాట్‌ఫాంలో ఈ-కంటెంట్ తయారు చేయడం, టీచర్ హ్యాండ్‌బుక్ రాయడం, ప్రశ్నాపత్రాల తయారీ, ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్‌గా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్‌లో భాగంకావడం చాలా సంతోషం. ఎఫ్‌ఎల్‌ఎన్, జాదూయి పిఠరా కిట్లను ఉపయోగిస్తూ పిల్లలకి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న తీరు స్ఫూర్తిగా నిలుస్తోంది. వినూత్న విద్యాబోధన, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎలా తయారు చేయాలి? కిట్లు ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశాలపై చేసిన వీడియోలను ‘సౌజన్యటీఎల్‌ఎం’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసి కోట్లాదిమందికి చేరుస్తున్న సౌజన్య టీచర్‌కు హృదయపూర్వక అభినందనలు’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.













