అమరావతి (చైతన్య రథం): సినీ నటుడు సోనూసూదుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెడుతూ ‘మీ నిస్వార్థ దాతృత్వం, ఆపదలో ఉన్నవారికి చేసిన సాయం దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలకు ఉపయోగపడిరది’ అని కొనియాడారు. సోనూసూద్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌పై సోనూసూద్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.