అమరావతి (చైతన్యరథం): ఆటపాటలతో పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలిని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ప్రయత్నమే తొలి విజయం అని భావించి ఆ దిశగా కృషి చేస్తున్న మండపేట శారదా మున్సిపల్ పాఠశాలలో ఎస్జీటీ (సింగిల్ టీచర్)గా పనిచేస్తున్న అమలదాసు కావేరికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. జీరోగా ఉన్న విద్యార్థుల సంఖ్యను 11కి చేర్చిన మీకు హ్యాట్సాఫ్. పిల్లల వయసు, ఆలోచనలకి తగ్గట్లు వినూత్నమైన బోధనా పద్ధతులతో పాఠాలు చెబుతున్న తీరు చాలా బాగుంది. ఆటపాటలతో చదువు నేర్పిస్తూ, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, దేశభక్తిని బోధించడం చాలా సంతోషం. ఎఫ్‌ఎల్‌ఎన్, టీఎల్‌ఎమ్, రీల్స్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం ప్రశంసనీయం. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేసిన మీ కృషి చాలామందికి స్ఫూర్తినిస్తుందని మంత్రి లోకేష్ ప్రశంసించారు.















