- ఇక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని రుజువైంది
- టెన్త్ పరీక్షలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో సత్ఫలితాలు
- మంత్రి నారా లోకేష్‌తో సన్మానం ఊహించలేదు
- ఇలాంటి మెడల్స్ ఎన్నో అందుకోవాలి
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత, రుచి పెరిగాయి
- షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమంలో విద్యార్థుల స్పందన
ఉండవల్లి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని కూడా ర్యాంకర్లు అవ్వొచ్చని, ఇక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని రుజువైందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్-2025 పేరుతో ఉండవల్లి నివాసంలో విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు.
1. మా తర్వాతి తరాలు స్ఫూర్తిపొందుతారు
అంగడి పావని చంద్రిక, విద్యార్థిని
మార్కులు:598/600
పాఠశాల:జడ్పీ హైస్కూల్, ఒప్పిచర్ల
కారంపూడి మండలం, పల్నాడు జిల్లా
మాకు చాలా గర్వంగా ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మమల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్మానిస్తారని అసలు ఊహించలేదు. గతంలో కంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెరిగింది, రుచి కూడా బాగుంది. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 598 మార్కులు రావడం పట్ల మా తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రోత్సాహం వల్ల తర్వాతి తరాల పిల్లలు స్ఫూర్తి పొందుతారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని మా మార్కుల ద్వారా రుజువైంది. ఉపాధ్యాయులు మాకు బాగా చదువు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని కూడా ర్యాంకర్లు అవొచ్చు. ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం.
2. ఇలాంటి మెడల్స్ ఎన్నో అందుకోవాలి
కంచరాన జ్యోషిత, విద్యార్థిని
మార్కులు:597/600
పాఠశాల:జడ్పీ హైస్కూల్, హరిపురం
మందస మండలం, శ్రీకాకుళం జిల్లా
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మెడల్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ స్థాయిలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో బోధన బాగుంది. ఇలాంటివి మరెన్నో సాధించాలి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మార్పులు వచ్చాయి. టీచింగ్ కూడా బాగుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కావాలనేది నా లక్ష్యం. యూపీఎస్సీ సాధించి ప్రజలకు సేవ చేస్తా.
3. మంత్రి లోకేష్‌తో సన్మానం అసలు ఊహించలేదు
షేక్ సమీర, విద్యార్థిని
మార్కులు:596/600
పాఠశాల:జడ్పీ గర్ల్స్ హైస్కూల్, మాచర్ల
పల్నాడు జిల్లా
మాకు చాలా ఉద్వేగభరితంగా, ఆనందంగా ఉంది. మా నాన్న ఎలక్ట్రీషియన్. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నా ఇద్దరు చెల్లెళ్లూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చాలా మెరుగయింది. టేస్ట్, క్వాలిటీ పెరిగాయి. గతంలో కంటే ఆహారం సరిపడినంతగా పెడుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ వచ్చిన తర్వాత స్టడీ మెటీరియల్ అందించారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌కు ముందు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం చాలా ఉపయోగపడిరది. ఎలా చదవాలో చెప్పారు. లోకేష్‌తో సన్మానం అందుకుంటానని అసలు ఊహించలేదు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే పల్నాడు జిల్లాలో అత్యధికంగా 598 మార్కులు వచ్చాయి. మా ఎమ్మెల్యే జిల్లా ఫస్ట్, సెకెండ్ వచ్చిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు. మా మార్కులు పట్ల ఎంతో ఆనందించారు. ఇంటర్‌లో ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. ఐఏఎస్ అయిన తర్వాత పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తా. రైతులకు సహాయం చేస్తా. పర్యావరణాన్ని కాపాడతా. వెనుకబడిన పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా.
4. టెన్త్ పరీక్షలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో సత్ఫలితాలు
కనితి కిషోర్, దివ్యాంగ విద్యార్థి
మార్కులు:487/500
పాఠశాల:జడ్పీ హైస్కూల్, హుకుంపేట, రాజమండ్రి
తూర్పుగోదావరి జిల్లా
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి మంత్రి లోకేష్‌తో అభినందనలు పొందడం చాలా ఆనందంగా ఉంది. మంత్రిని ఇలా కలవడం వండర్ ఫుల్ ప్రోగ్రామ్. పదో తరగతి పరీక్షలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సత్ఫలితాలను ఇచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించారు. అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలని చెప్పారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, మంచి లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ బాగుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బాగుంది. గతంలో కంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద అందించే కిట్లు నాణ్యతగా ఉన్నాయి. వీటిపై ఎలాంటి పార్టీ గుర్తులు లేవు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం వండర్ ఫుల్ డెసిషన్. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు నవంబర్ 18 నుంచి మార్చి 10 వరకు రివిజన్ టెస్ట్ నిర్వహించారు. మార్చి 3 నుంచి 13 వరకు గ్రాండ్ టెస్ట్ లు జరిగాయి. గతంలో ప్రీ ఫైనల్ తర్వాత బోర్డు పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రీ ఫైనల్ కు ముందు గ్రాండ్ టెస్ట్ పెట్టడం వల్ల మాలో భయం పోయింది. చాలా హెల్ప్ ఫుల్ అయింది. ఈ ఏడాది నుంచి ఎన్‌సీఈఆర్టీ సిలబస్ కావడంతో గ్రాండ్ టెస్ట్‌ల వల్ల పరీక్షలంటే భయం పోయింది. ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 5.30 గం.ల వరకు స్టడీ అవర్స్ పెట్టారు. దివ్యాంగ విద్యార్థులు పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని, అందరిలానే మనం అనేది నా సలహా. పేదలకు అన్నివిధాల అండగా నిలబడేందుకు భవిష్యత్ లో ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం.
5. చాలా ఆనందంగా ఉంది
అంగడి సంధ్య
విద్యార్థిని పావని చంద్రిక తల్లి
మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మా పాప సత్కారం పొందడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేది. ఉదయం 4 గం.లకే నిద్ర లేస్తుంది. ఆరోగ్యం బాగాలేకపోయినా పాఠశాలకు వెళ్లేది. ఉపాధ్యాయులు సబ్జెక్టుల్లోని అనుమానాలను నివృత్తి చేసేవారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడిరది. ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ టాలెంట్ టెస్ట్ ల్లో కూడా ప్రథమస్థానంలో నిలిచేది. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించారు.