అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పోస్టు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నా సర్వస్వం నువ్వే. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారని చంద్రబాబు పేర్కొన్నారు.
అమ్మ ప్రేమే నాకు పెద్ద బలం: నారా లోకేష్
నారా భువనేశ్వరికి ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్(ట్విటర్) లో పోస్టు చేశారు. ఆమె ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు. రోజూ అమ్మను ఆరాధిస్తానని తెలిపారు. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేస్తున్న ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు.
ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాను: భువనేశ్వరి
చంద్రబాబు ట్వీట్‌కు స్పందించిన నారా భువనేశ్వరి.. ధన్యవాదాలు అండీ. ప్రతిరోజూ మెరుగ్గా ఉండటానికి మీరే నా ప్రేరణ. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పట్ల మీ భక్తికి నేను గర్వపడుతున్నాను. మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను. మీరే నా సర్వస్వం అని రీట్వీట్ చేశారు.