- రూ.100 కోట్లతో ఏర్పాటుకు సీఎం అంగీకారం
- గత ప్రభుత్వంలో ఆయుష్‌పై పూర్తిగా నిర్లక్ష్యం
- ఇచ్చిన భూమి ఇళ్ల స్థలాలకు కేటాయించారు
- శాప్ కింద కేంద్రం నుంచి తెచ్చింది రూ.71 కోట్లే
- కూటమి పాలనలో మూడునెలల్లోనే రూ.28 కోట్లు
- ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం
- వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి(చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిరచారు. గురువారం అసెంబ్లీలో ఆయుష్ విభాగంపై సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధాన మిస్తూ 2018లోనే కేంద్రం మంజూరు చేసిన ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అప్పటి ఎన్డీయే ప్రభుత్వం గన్నవరం నియోజకవర్గం కొండపావులూరు గ్రామంలో 25 ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తుచేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతి పాదనలను బుట్టదాఖలు చేసి ఆ స్థలాన్ని జగనన్న కాలనీ కోసం కేటాయించడం దారు ణమన్నారు. కూటమి వచ్చాక ప్రస్తుతం ఈ యోగా నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని రూ.100 కోట్లతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని, ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని వివరించారు.
గత ప్రభుత్వంలో ఆయుష్‌ను గాలికొదిలారు
ఆయుష్ విభాగం పనితీరుపై గత ప్రభుత్వం సమీక్షించిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలో అటువంటి విభాగమొకటి ఉందా అని జగన్ అడిగిన సందర్భాలు న్నా యి. వారి వైఖరితో ఆయుష్ డిస్పెన్సరీలను సిబ్బంది, నిధుల కొరత కారణంగా మూ తవేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఆ శాఖపై అప్పటి ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శాఖపై సమీక్షలు నిర్వహించి సంప్రదాయ వైద్య పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు. ఆయుష్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 327 వైద్యాధికారుల పోస్టులు ఉంటే అందులో 67 ఖాళీలు, హోమియో వైద్య విధా నంలో 190 పోస్టులు ఉంటే అందులో 62 ఖాళీలు, యునాని విభాగంలో 73 పోస్టులకు 32 ఖాళీలు, పారామెడికల్ సిబ్బంది విషయంలో 323 పోస్టులు మంజూరు కాగా 272 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. మొత్తంగా 1087 పోస్టులు మంజూరు కాగా 458 (దాదాపు 40 శాతం మేర) ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఈ తేడాలను సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 138 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని మంత్రి వెల్లడిరచారు. ఆయుర్వేద వైద్య విభాగంలో 72 మంది వైద్యాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా దానికి 62 మంది ఇప్పటికే ఎంపికయ్యారని, వారు త్వరలోనే విధుల్లో చేరనున్నారని చెప్పారు. హోమియో విభాగంలో 53 పోస్టులకు 52 మంది ఎంపికయ్యారని, యునాని విభాగంలో 26 పోస్టులకు 15 మంది ఎంపికయ్యా రని వివరించారు. ఈ విధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఈ వైద్య విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఆయుష్‌ను విభాగాన్ని చంపేయాలనుకున్నారు
ఆయుష్ విభాగాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా పూర్తిగా చంపేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. ఆయుష్ విభాగానికి గత ఐదేళ్ల కాలంలో కేంద్రం నుంచి స్టేట్ యానువల్ యాక్షన్ ప్లాన్ కింద రాష్ట్రానికి అందిన నిధులు కేవలం రు.71 కోట్లు మాత్రమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన మూడు నెలల్లోనే రూ.28 కోట్లు శాప్ కింద కేంద్రం నుంచి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఆయుష్ శాఖ అభివృద్ధి కోసం రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు పంపటం, కేంద్రం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం కానీ గత ప్రభుత్వం చేయలేదంటే ఆయుష్ పై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్రం నిధులివ్వటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని అందుకుని సద్వినియోగం చేసేందుకు గత ప్రభుత్వం ఎటువంటి ఆలోచనా చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మొదటి మూడు నెలల కాలంలోనే రూ.28 కోట్ల కేంద్ర నిధులతో ఈ శాఖను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు.
చంద్రబాబు ఆయుష్‌కు జీవం పోశారు
కాకినాడలో రూ.7.2 కోట్ల నిధులతో 60 బెడ్ల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిని, విశాఖలో రు.8.3 కోట్ల వ్యయంతో 80 బెడ్ల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. ఆయుర్వేద విశ్వవిద్యాలయం స్థాయిలోనే 2018లో కేంద్రం మన రాష్ట్రానికి యోగ, నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసింది. ఇటీవల కేంద్ర మంత్రి తనకు ఫోన్ చేసి రాష్ట్రానికి మంజూరైన పరిశోధనా కేంద్రానికి ప్రధాని నరేం ద్రమోదీ భూమిపూజ చేసేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఇందుకు అనువైన సమయాన్ని సూచించాలని కోరారు. 2018 లో మంజూరైన దీని కోసం గన్నవరం నియోజకవర్గంలోని కొండపావులూరు గ్రామంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయిస్తే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ ఆ ప్రతిపాదనను బుట్టదాఖలాలు చేసిందని చెప్పారు. ఈ అంశంపై ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు నాడు కేటాయించిన స్థలం జగనన్న ఇళ్ల కాలనీల కు అప్పటి ప్రభుత్వం కేటాయించిందని తనకు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినపుడు ఈ కేంద్రాన్ని రాజధాని అమరావతిలోనే రూ.100 కోట్లతో ఏర్పాటు చేద్దామన్నారని, అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పా రని వివరించారు.
త్వరలో ఖాళీల భర్తీకి చర్యలు
ఆయుర్వేదం, హోమియో ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతపై అసెంబ్లీలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిస్తూ రాష్ట్రంలో మూడు ఆయుష్ ఆస్పత్రులు, ఒక ఆయుర్వేద బోధనా ఆస్పత్రి, రెండు మినీ ఆయుర్వేద ఆస్ప త్రులు, మూడు హోమియో బోధనా ఆస్పత్రులు పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా 20 ఆయుర్వేద, 16 హోమియో ఆస్పత్రులు పని చేయడం లేదని వెల్లడిరచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 67 ఆయుర్వేద వైద్యాధికారుల పోస్టులకు 50 మంది నియమితులైనట్లు చెప్పారు. 20 ఆయుర్వేద, 16 హోమియో ఆస్పత్రులు సిబ్బంది కొరత కారణంగా పనిచేయడం లేదని వివరించారు. ఈ ఆస్పత్రులలో ఖాళీల భర్తీ కోసం అవసరమైన అనుమతులు తీసుకుని నియామక ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో 126 ఆయుష్ డిస్పెన్సరీలను పునరుద్ధరించామని, అవి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లుగా ప్రస్తుతం సేవలందిస్తున్నాయని వివరించారు. ప్రజలకు ఆయుష్ వైద్యసేవలు అందుబా టులోకి తీసుకొచ్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.