- రైతులకు ఏమి చేశారో చర్చకు సిద్ధమా?
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం
- ధాన్యం డబ్బు 100 శాతం జమచేశాం
- మీరు పెట్టి వెళ్లిన బకాయిలు చెల్లించాం
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి(చైతన్యరథం): పౌరసరఫరాల సంస్థ ఖరీఫ్, రబీ 2024 -25 సీజన్లో 2,01,934 రైతుల వద్ద నుంచి రూ.4575.32 కోట్ల విలువైన 19,84,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు బకాయి ల నిమిత్తం గురువారం రూ.659.39 కోట్లను 30,403 రైతుల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. 2024-2025 మొత్తం ఇప్పటివరకు రూ.4575.32 కోట్లను 2,01,934 రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. 100 శాతం సొమ్మును రైతుల ఖాతాల లో జమ చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1674.47 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం 84,724 మంది రైతులకు పూర్తిగా జమ చేయటం జరిగిందని వివరించారు. ఒక పార్టీ అధినేత చిల్లర మనస్తత్వంతో గతంలో మనిషిని తొక్కించారు. నేడు చిత్తూరు జిల్లాలో మామిడికాయలు తొక్కించారు.. ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే చర్చకు రావాలని కోరారు. ఐదు ట్రాక్టర్లతో రెడీ చేసుకున్న పంటను దొంగ చాటుగా తీసుకు వచ్చి రోడ్డుపై మామిడి కాయలు పోసి కేవలం ఫొటోల కోసం, వీడియోలు కోసం పంటను ట్రాక్టర్లతో తొక్కేయడం దుర్మా ర్గం. రైతులకు మీరు ఏమి చేశారో, కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చర్చకు రావాలని కోరారు. వ్యక్తిగత విమర్శలు, పోలీసు అధికారులను బెదిరించడం, కాలు నరుకుతాం.. చేతులు నరుకు తాం అంటూ ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించారు. రైతులపై ప్రేమ ఉంటే వారిని కలిసి సమస్యలు తెలుసుకుని ప్రభు త్వం దృష్టికి తీసుకురావాలి.. శాసనసభలో చర్చించాలి. అలా కాకుండా రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరిం చా రు. ప్రజలు, రైతులు, మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుంద ని తెలిపారు.